Tesla Model S AND X: ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో అగ్రగామి అయిన టెస్లా, తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన మోడల్ S, మోడల్ X లను మరింత లేటెస్ట్ ఫీచర్లతో, మంచి పర్ఫామెన్స్ తో అప్‌గ్రేడ్ చేసింది. నిరంతర ఆవిష్కరణలను చేస్తున్న టెస్లా ఈ అప్‌డేట్‌ల ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త ప్రమాణాలను చేర్చింది. ఈ తాజా ఫీచర్లు కార్లను మరింత లగ్జరీగా పర్ఫామెన్స్ పరంగా నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లనున్నాయి.
టెస్లా ఎప్పుడూ తన వాహనాల్లో లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తూనే ఉంటుంది. ఈసారి మోడల్ S , మోడల్ X అప్‌డేట్‌లు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కొత్త ఫ్రాస్ట్ బ్లూ పెయింట్ కలర్ వంటి సరికొత్త ఆప్షన్లు, అలాగే ఇంటర్నల్, ఎక్సటర్నల్ డిజైన్లలో చేసిన మార్పులు ఈ కార్లకు మరింత ఎట్రాక్టివ్ లుక్ ఇస్తున్నాయి. ఇవి కేవలం కార్లు మాత్రమే కాదు, భవిష్యత్ మొబిలిటీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read: Maruti Suzuki cars : కొత్త ఏడాది కొత్త మోడళ్లతో మార్కెట్‌లోకి మారుతి సుజుకీ!
మోడల్ S లాంగ్ రేంజ్ వెర్షన్ ఇప్పుడు 410 మైళ్ల (దాదాపు 660 కి.మీ.) వరకు అత్యధిక రేంజ్‌ను అందిస్తోంది, ఇది టెస్లా ఉత్పత్తి చేసిన అత్యంత ఎక్కువ రేంజ్ కలిగిన ఈవీగా నిలిచింది. ఇంటర్నల్ గా కూడా కొత్త అప్‌డేట్‌లతో క్యాబిన్ మరింత కూల్ అనిపిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు గాలి, ఇతర శబ్ధాలు గణనీయంగా తగ్గిపోయాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తూ, ప్రయాణికులకు ప్రశాంతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.
ఇది కాకుండా, కొత్త వీల్ డిజైన్‌లు కారు రేంజ్‌ను పెంచడంలో సహాయపడ్డాయి. దీనివల్ల కారు గాలిలో కూడా మరింత సమర్థవంతంగా కదులుతుంది. ముందు భాగంలో అమర్చిన ఫ్రంట్ ఫాసియా కెమెరా డ్రైవర్‌కు మంచి విజిబిలిటీని అందిస్తుంది. ముఖ్యంగా పార్కింగ్, ఇరుకు సందుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
Also read: CNG Cars : CNG కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే బెస్ట్ మోడల్స్ ఇవే.
మోడల్ S , X లోని క్యాబిన్ లోపల డైనమిక్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ ప్రయాణికులకు ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. కారులోకి ప్రవేశించగానే డ్యాష్‌బోర్డ్, డోర్‌ల వెంట స్పెషల్ యానిమేషన్లతో కూడిన లైటింగ్ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. కొత్త బుషింగ్‌లు, సస్పెన్షన్ డిజైన్ కారణంగా డ్రైవింగ్ మరింత స్మూత్ గా మారింది. గుంతల రోడ్లపైనా కూడా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్స్ రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి. ఇవి రోడ్డు పరిస్థితికి తగ్గట్టుగా లైటింగ్‌ను అడ్జస్ట్ చేస్తాయి. మోడల్ S ప్లాయిడ్కు కొత్త ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ వచ్చింది. ఇది అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు స్టెబిలిటీని మరింత పెంచుతుంది.
మోడల్ X విషయానికి వస్తే.. ఇది ఒక పవర్‌ఫుల్ SUVగా పాపులర్. తాజా అప్‌డేట్‌లలో, మూడవ వరుసలోని ప్రయాణికులకు, కార్గో కోసం మరింత స్పేస్ లభించింది. ఇది పెద్ద కుటుంబాలకు, ఎక్కువ సామానుతో ప్రయాణించే వారికి మరింత బాగుంటుంది. మోడల్ X ఫాల్కన్ వింగ్ డోర్లు, దాని విశాలమైన ఇంటీరియర్ ఎప్పుడూ ఎట్రాక్టివ్ గా ఉంటాయి. టెస్లా నిరంతరం తన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల ద్వారా మెరుగుపరుస్తుంది. దీని అర్థం, కొత్త కార్లు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న కార్లలో కూడా ఈ కొత్త ఫీచర్లు కొన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా అందుబాటులోకి రావచ్చు.