CNG Cars : కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారులు పెరిగిపోతున్నారు. అయితే ఒకప్పుడు డీజిల్ కంటే పెట్రోల్ వాహనాలే బెస్ట్ అని భావించారు. ఎందుకంటే పెట్రోల్ వాహనాల నుంచి పొగ తక్కువ రావడమే కాకుండా డ్రైవింగ్ అనుభూతి ఎక్కువగా ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు CNGవాహనాల కోసం చాలా మంది ఆరాటపడుతున్నారు. ఈ వేరియంట్ వాహనాలు పెట్రోల్ కంటే బెటర్ అనిపించుకుంటున్నాయి. ఎందుకంటే తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇస్తుండడంతో పాటు కార్ల ధర కూడా తక్కువగానే ఉంటోంది. ఇటీవల CNG వాహనాల సంఖ్య మార్కెట్లో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టాప్ మోడళ్ల గురించి తెలుసుకుందాం..
Also Read : 7 సీటర్లో బెస్ట్ సేఫ్టీ కార్లు ఏవో తెలుసా?
దేశంలో అత్యధిక వాహనాలను సేల్స్ చేయడంలో ప్రత్యేకతను సాధించుకున్న Maruthi Suzuki నుంచి అనేక వేరియంట్ లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ మధ్య CNG వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. వీటిలో Desire బెస్ట్ సీఎన్ జీ వెహికల్ గా పేరు తెచ్చుకుంది. ఈ మోడల్ లగ్జరీ ఫీచర్లను కలిగి ఆకట్టుకునే డిజైన్ తో కనిపిస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు సౌండింగ్ కోసం 6 స్పీకర్స్ ను అమర్చారు. అలాగే వైర్ లెస్ మొబైల్ ఛార్జర్ వంటి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో ఉన్న CNG కిలో ఇంధనానికి 33.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ సేప్టీలోనూ 5 స్టార్ రేటింగ్ పొందడం విశేషం. దీనిని రూ.9.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
TaTa కంపెనీకి చెందిన ఎన్నో వాహనాలు ఇప్పటికే అలరించాయి. SUV వెహికల్స్ ను తీసుకురావడంలో ఈ కంపెనీ ఉత్తమమైనదిగా చెప్పుకుంటారు. అలాగే CNG వేరియంట్ లో కూడా ఓ కారును తీసుకొచ్చారు. ఈ కంపెనీకి చెందిన Punch బెస్ట్ CNG గా పేరు తెచ్చుకుంది. దీని డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే ఇందులో అదిరిపోయే ఫీచర్లతో పాటు మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులో 10.25 అంగుళాల ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు 6 స్పీకర్స్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నాయి. అలాగే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ లు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న సీఎన్ జీ లీటర్ ఇంధనానికి 25 నుంచి 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
Maruthi Suzuki మరో కారు Swift సీఎన్ జీ వేరియంట్ అలరిస్తోంది. పెట్రోల్ వేరియంట్ లో స్విప్ట్ కారు ఇప్పటికే చాలా మందిని అలరించింది. ఇప్పుడు CNG వేరియంట్ లోనూ ఆకట్టుకోనుంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండింగ్ సిస్టమ్ ను అమర్చారు. అలాగే ఏసి వేరియంట్ తో పాటు ప్రయాణికులకు అనుగుణంగా సీటింగ్ సౌకర్యాన్ని అమర్చారు. ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 32.50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం దీనిని రూ. 9.20 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
Also Read : ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో టాటా దూకుడు! హారియర్ ఈవీతో సరికొత్త సవాల్!