Sunita Williams: బయటి వాతావరణం లో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అవి దాడి చేస్తాయి. ఏదో ఒక వ్యాధిని కలగజేస్తాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మందులు వేసుకుంటాం. వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఇంజక్షన్లు వాడతాం. అయితే ఇలాంటి పరిస్థితి అంతరిక్షంలోనూ ఉంటుందా? ఎంతో పకడ్బందీగా ఉండే స్పేస్ స్టేషన్ లోనూ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతోంది నాసా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఇంకా మరో ఎనిమిది మంది ఆస్ట్రోనాట్స్ ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. పలుమార్లు వాయిదా పడిన ఆ మిషన్.. ఎట్టకేలకు విజయవంతమైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న నాసా.. ఇప్పుడు సరికొత్త సమస్యతో ఆందోళన చెందుతోంది. అంతరిక్ష కేంద్రంలో స్పేస్ బగ్ (space bug) ప్రవేశించడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎంటిరో బ్యాక్టర్ బుగండెన్సిస్ బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలోకి ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ జీవిని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని అంతరిక్ష పరిశోధకులు తేల్చి చెప్పేశారు. స్పేస్ స్టేషన్ లో ఉన్న వాతావరణాన్ని ఆ బ్యాక్టీరియా అత్యంత సమర్థవంతంగా తట్టుకుంటుందని ప్రకటించారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ వల్ల ఆ బ్యాక్టీరియాను సూపర్ బగ్ అని పిలవాల్సి ఉంటుందని నాసా పరిశోధకులు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా నేరుగా వ్యోమగాముల ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, ఎంతటి చర్యలు తీసుకున్నప్పటికీ అది వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు.
సూపర్ బగ్స్ అనేవి అప్పటికప్పుడు ఏర్పడవని, అవి గ్రహాంతర జీవులు కూడా కావని, వ్యోమగాములతోనే స్పేస్ స్టేషన్ కు ప్రయాణించి ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎంటిరో బ్యాక్టర్ బుగం డెన్సిస్ కు 13 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయట. వీటిని నాసా పరిశోధకుల బృందం పరిశీలిస్తోంది. ఆ బ్యాక్టీరియా లో అనేక రకాలు స్వీయ శక్తిని సమపార్జించుకుంటున్నాయని నాసా ప్రకటించింది. ఇతర సందర్భాలలో.. మిగతా జీవులు కూడా బతికేందుకు ఆ బ్యాక్టీరియా సహకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక ఈ బ్యాక్టీరియా పై కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొఫల్షన్ ప్రయోగశాలలో పనిచేస్తున్న కస్తూరి వెంకటేశ్వరన్ అధ్యయనం సాగిస్తున్నారు. నాసాలో ఆయన ప్రవేశించే ముందు చెన్నైలోని అన్నమలై యూనివర్సిటీలో మైక్రో బయాలజీ లో మాస్టర్స్ చేశారు. ఆ సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టంట్ కళేమిలా పీయార్సోని బగ్ ను ఆయన కనుగొన్నారు.. అప్పట్లోనే ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అయితే దానికి, బుగం డెన్సిస్ కు మధ్య దగ్గర సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల వ్యోమగాముల ఆరోగ్యం దెబ్బతింటుందని.. శ్వాస కోశ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి ఎలాంటి డ్రగ్ థెరపీ వాడతారనేది ఇంతవరకూ నాసా స్పష్టం చేయలేదు. సునీత విలియమ్స్, మిగతా వ్యోమగాముల ఆరోగ్యం బాగోలేదని చెప్పిన నాసా.. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై అంతర్జాతీయ మీడియా రకరకాల కథనాలను ప్రసారం చేస్తోంది. వీటిపై నాసా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Sunita williams a space bug that can infect the respiratory system has been found on the space station
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com