Sunitha Williams : ప్రముఖ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(Sunitha Williams) కు కుక్కలు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. సునీత విలియమ్స్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో.. వారు కుక్కలను పెంచుకుంటున్నారు. చిన్నప్పటినుంచి సునీత విలియమ్స్ కు కుక్కలు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వాటిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అందువల్లే సునీత కనిపిస్తే చాలు ఆ కుక్కలు ఆమెను చుట్టుముట్టేస్తాయి. ఆమెతో సయ్యాటలాడుతుంటాయి.. ఆమె కూడా వాటిని ప్రేమగా దగ్గరికి తీసుకొని.. ఆప్యాయత ప్రదర్శిస్తూ ఉంటుంది.. గతంలో అనేక ఇంటర్వ్యూలలో పెంపుడు కుక్కలపై తనకు ఉన్న ఆసక్తిని సునీతా విలియమ్స్ చెప్పు కొచ్చారు. ఇక గతేడాది అంతరిక్షంలోకి వెళ్లే ముందు కూడా కుక్కలతో సునీత విలియమ్స్ సరదాగా గడిపారు.
Also Read : అంతరిక్షం నుంచి భారత్ ఎలా ఉంటుందో తెలుసా.. సునీతా విలియమ్స్ అనుభవం
9 నెలలు దూరంగా ఉన్నారు
ప్రయోగం నిమిత్తం బూచ్ విల్ మోర్ తో కలిసి గత ఏడాది అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ అనుకోని పరిస్థితుల్లో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. దాదాపు 9వ నెలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె ఉండి పోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో కాల్ లో మాట్లాడేవారు. ఆ సమయంలో సునీత భర్త పెంపుడు కుక్కలను ఆమెకు చూపించేవారు. ఆమెను చూసిన కుక్కలు సయ్యాటలాడేవి. ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని రకరకాల సంకేతాలు చేసేవి.. అప్పట్లో గ్లోబల్ మీడియా ఈ విషయాలను ప్రధానంగా ప్రచురించింది. ఇక తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల భూమి మీదకు సునీత విలియమ్స్ అడుగుపెట్టింది. అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు కాబట్టి.. భూమీ మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీ పరిస్థితులకు అనుగుణంగా ఆమె లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇదే క్రమంలో ఆమెను చూసిన పెంపుడు శునకాలు ఒక్కసారిగా తన్మయత్వానికి లోనయ్యాయి. ఇన్ని రోజులపాటు సునీత విలియమ్స్ ను మిస్ అయిన కుక్కలు.. ఆమెను చుట్టుముట్టాయి. కుక్కలు ఒక్కసారిగా రావడంతో సునీత విలియమ్స్ కూడా ఆనందానికి గురయ్యారు.. ఆ కుక్కలను చూసిన వెంటనే సునీత విలియమ్స్ ఆనందంతో కేరింతలు కొట్టారు.. కుక్కలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సునీతా విలియమ్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ” సునీతకు సహనం ఎక్కువ. అందువల్లే అన్ని కుక్కలు ఆమెను చుట్టుముట్టాయి. వాటి ప్రేమను ఆమెపై వ్యక్తం చేశాయి. ఇన్ని రోజులు దూరమైనందుకు తమ ప్రేమ ఆమెపై చూపించాయి.. ఈ దృశ్యాలు హృదయాన్ని తాకుతున్నాయి. మూగజీవాల ప్రేమను పొందిన సునీత చరితార్దురాలు. అన్ని కుక్కలను సునీత సాకుతున్నారంటే గొప్ప విషయమని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Best homecoming ever! pic.twitter.com/h1ogPh5WMR
— Sunita Williams (@Astro_Suni) April 1, 2025