Goes-U Satellite: ఏమిటీ GOES – U ఉపగ్రహం.. ఎలాన్ మస్క్ దేనికోసం ప్రయోగించాడు?

గోస్ - యూ ఉపగ్రహం భూమికి 22,236 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థిర కక్ష్య వైపు ప్రయాణించింది.. ఇది భూమి వాతావరణం ఇమేజింగ్ ను, మన గ్రహం పై ప్రభావం చూపించే అంతరిక్ష వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు చెబుతుంది.. కెన్నెడి స్పేస్ సెంటర్ ప్యాడ్ 39 A నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 3:59 pm

Goes-U Satellite

Follow us on

Goes-U Satellite: టెస్లా, ట్విట్టర్ ఎక్స్.. సాటిలైట్ ఇంటర్నెట్.. ఇలా రకరకాల వ్యాపారాలలో అందె వేసిన చేయిగా ఉన్న ఎలా మస్క్.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షానికే గురిపెట్టాడు.. గోస్ – యూ పేరుతో అంతరిక్ష ప్రయోగాన్ని చేశాడు.. ఈ ప్రయోగంలో భాగంగా మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. ట్రిబుల్ కోర్ ఫాల్కన్ హెవీ 9 సైడ్ బూస్టర్లను వినియోగించాడు. ఈ ఉపగ్రహాన్ని నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగిస్తారు.

గోస్ – యూ ఉపగ్రహం భూమికి 22,236 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థిర కక్ష్య వైపు ప్రయాణించింది.. ఇది భూమి వాతావరణం ఇమేజింగ్ ను, మన గ్రహం పై ప్రభావం చూపించే అంతరిక్ష వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు చెబుతుంది.. కెన్నెడి స్పేస్ సెంటర్ ప్యాడ్ 39 A నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళింది. ప్యాడ్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత.. రెండు కొత్త సైడ్ బూస్టర్లు విడిపోయాయి.. కేప్ కెనావెరల్ స్పేస్ పోర్స్ స్టేషన్ లో జోన్ 1, 2 వద్ద అవి ల్యాండ్ అయ్యాయి.. దీనికోసం స్పేస్ ఎక్స్ కొత్త కోర్ బూస్టర్ ఏర్పాటు చేసింది. దాని పని పూర్తయిన తర్వాత కోర్ బూస్టర్ సముద్రంలోకి వెళ్లిపోయింది. “రాకెట్ లాంచ్ ప్యాడ్ వద్దకు ఆలస్యంగా వచ్చింది. సోమవారం చివరి వరకు రాకెట్ రాలేదు. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రయోగం కాస్త ఆలస్యమైంది. స్పేస్ క్రాఫ్ట్ ను సరిదిద్దేందుకు స్పేస్ ఎక్స్ బృందాలు ఉపగ్రహాన్ని హాంగర్ లో ఉంచాలని నిర్ణయించుకున్నాయి. అందువల్లే రాకెట్ బయటికి తీయడం ఆలస్యమైందని” స్పేస్ ఎక్స్ అధికారులు వెల్లడించారు.

ఈ ఉపగ్రహం ముందుగానే తుఫాన్ ను గుర్తిస్తుంది. దానివల్ల ఏదైనా ముప్పు ఏర్పడితే ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు అవకాశం ఉంటుంది. వాతావరణ మాత్రమే కాదు సూర్యుడిపై ఈ ఉపగ్రహం ద్వారా మరింత అధ్యయనం చేయొచ్చు. సౌర మంటలను వెంటనే గుర్తిస్తుంది.. తీసుకోవలసిన చర్యలను వెల్లడిస్తుంది. అయితే ఈ ఉపగ్రహం ఏడాది పాటు చురుకుగా ఉంటుంది..గోస్ – యూ ఇతర ఉపగ్రహాలతో కలిసి పనిచేస్తుంది. అయితే ఇప్పటికే గోస్ సిరీస్ లో “ఆర్” అనే ఉపగ్రహం అంతరిక్షంలో ఉంది.. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన యూ అనే ఉపగ్రహం గోస్ విభాగంలో చివరిది.. గోస్ ఆర్ ఉపగ్రహాన్ని 2016లో అట్లాస్ వీ రాకెట్ లో ప్రయోగించారు.. ఇక గోస్ యూ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించేందుకు తోడ్పడిన తర్వాత స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ నుంచి సైడ్ బూస్టర్లు కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ లో ల్యాండింగ్ కోసం వచ్చాయి. ఇక ఈ ఉపగ్రహం అమెరికా, కరేబియన్, అట్లాంటిక్ మహాసముద్రంతో సహా పశ్చిమ అర్ధగోళంలో చాలావరకు ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది.. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోనూ పాగా వేసేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ విభాగంలో బోయింగ్ ముందు వరుసలో ఉంది.