Afghanistan: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కసి.. ఎలా నేర్చారో ఈ ఆటను..

వాస్తవానికి ఇలాంటి ఉత్కంఠ మ్యాచులలో ఎంతటి తోపు బౌలర్ అయినా నిగ్రహాన్ని కోల్పోతాడు. లయను తప్పుతాడు.. ఫలితంగా పేలవమైన బంతులు వేసి చేతులు ఎత్తేస్తాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అద్భుతమైన బంతులు వేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 3:52 pm

Afghanistan

Follow us on

Afghanistan: అది సూపర్ -8 మ్యాచ్.. బంగ్లాదేశ్ – ఆఫ్ఘనిస్తాన్ తలపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. మరో 13 బంతులు వేస్తే చాలు ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తవుతుంది. అప్పటికి ఆ జట్టు ఆటగాళ్లు 93 పరుగులు మాత్రమే చేశారు. ప్రధాన ఆటగాళ్లు గట్టి షాట్లు కొట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 115 పరుగులకు చేరుకుంది.. అయినా ఆ స్వల్ప స్కోర్ ను కూడా ఆఫ్గనిస్తాన్ కాపాడుకుంది.. రెండు ఓవర్ల వ్యవధిలోనే, మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ బంగ్లాదేశ్ తగ్గలేదు. 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఈ దశలో ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కెప్టెన్ రషీద్ ఖాన్ రెండు బంతుల్లో, రెండు వికెట్లు పడగొట్టి మళ్లీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.

వాస్తవానికి ఇలాంటి ఉత్కంఠ మ్యాచులలో ఎంతటి తోపు బౌలర్ అయినా నిగ్రహాన్ని కోల్పోతాడు. లయను తప్పుతాడు.. ఫలితంగా పేలవమైన బంతులు వేసి చేతులు ఎత్తేస్తాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అద్భుతమైన బంతులు వేశారు. కేవలం బంతుల వ్యవధిలోనే వికెట్లు పడగొట్టారు. ఫీల్డర్లు తురుపు ముక్కల్లాగా కదిలారు.. అక్కడిదాకా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో పార్ట్ టైమర్ ఆటగాడు గుల్బాదిన్ సైతం అద్భుతంగా బౌలింగ్ వేశాడు.. ఇక సూపర్ -8 మ్యాచ్లో నవీన్ ఉల్ హక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు ప్రతి బంతిని ఒక బుల్లెట్ లాగా సంధించాడు. ఎంతో ఆలోచించి, ఎంతో వ్యూహాత్మకంగా బంతులను వేశాడు. ఇక ఫీల్డర్లు బంతిని ఆపేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరిగెత్తారు. బౌండరీ లైన్ వద్ద అడ్డుగోడ లాగా నిలబడ్డారు. అందువల్లే ఆఫ్గనిస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ ను కాపాడుకుంది. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ పై ఆ విజయ పంథాను కొనసాగించింది. రషీద్ ఖాన్, గుల్బాదిన్, నవీన్ ఉల్ హక్.. ఇలా ఎందరో ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలకంగా మారారు. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తూ టి20 వరల్డ్ కప్ లో తొలిసారిగా సెమిస్ చేరారు.

వాస్తవానికి బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో.. ఆఫ్ఘనిస్తాన్ తక్కువ స్కోర్ చేసింది. వీలైనంత ఎక్కువ స్కోర్ చేయాలనేది ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ తపన. ఈ దశలో బంతిని ఆడాడు. ఒక పరుగు తీశాడు. రెండవ పరుగు కోసం బుల్లెట్ వేగంతో దూసుకొచ్చాడు. కానీ అవతలి ఆటగాడి నుంచి స్పందన కరువైంది. దీంతో కోపంతో బ్యాట్ విసిరి కొట్టాడు. ఆ దృశ్యం చూస్తే చాలు ఆఫ్ఘాన్ ఆటగాళ్లకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పేందుకు.. ఇలా ఆడారు కాబట్టే.. ఆఫ్ఘాన్ ఆటగాళ్లు సెమిస్ చేరారు.. మేటి జట్లను మట్టి కరిపించారు.

ఈ టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘాన్ జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉంది. లీగ్ దశలో ఉగాండా జట్టును 58 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. న్యూజిలాండ్ జట్టును 75 పరుగులకే పడుకోబెట్టారు. పపువా న్యూ గినియా జట్టును 95 పరుగులకే కుప్ప కూల్చారు. ఇలా ఆ జట్టు ఆటగాళ్లు ప్రదర్శన చేయడం పట్ల వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వాన్ బ్రావో ఉన్నాడు. అతడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల బౌలింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా మీడియం ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.. ఇక ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ వెళ్లిన నేపథ్యంలో.. ఆ దేశ అభిమానులు పరోట్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆదేశం స్వాతంత్రం పొందినప్పుడు కూడా ప్రజలు ఇంతలా సంబరాలు చేసుకొని ఉండరు.