Viral Video: ఎంత తాగినా దేశభక్తి మరిచిపోలేదు.. మీరు సూపర్రా బాబూ! వైరల్ వీడియో

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు గాని.. ఆ వాతావరణం చూస్తుంటే బార్ అని అర్థమవుతోంది. చాలామంది మద్యం తాగుతూ కనిపిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 4:09 pm

Viral Video

Follow us on

Viral Video: మద్యం తాగే వాళ్లంటే ఈ సమాజానికి చాలా చులకన. వాస్తవానికి వారు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టుకొని.. ప్రభుత్వాలను సాకుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు.. ఇలా ప్రతి రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. అయినప్పటికీ మద్యం తాగే వారిని చాలామంది చులకనగా చూస్తుంటారు. హేళనగా మాట్లాడుతుంటారు. పొరపాటున మద్యం తాగి వస్తే దూరం వెళ్ళు అంటూ చీత్కరించుకుంటారు..ఇకతాగిన వాళ్లు మైకంలో ఏదేదో చేస్తారంటారు గాని.. ఈ వీడియో చూడండి.. అది తప్పనే అభిప్రాయం మీలో కచ్చితంగా వ్యక్తం అవుతుంది..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు గాని.. ఆ వాతావరణం చూస్తుంటే బార్ అని అర్థమవుతోంది. చాలామంది మద్యం తాగుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ సీజన్ సాగుతోంది కాబట్టి.. ఆ బార్ నిర్వాహకులు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ మీద టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రసారమవుతున్నాయి. అలా మ్యాచులు చూస్తూ చాలామంది మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియా తో తలపడిన సూపర్ -8 మ్యాచ్ లో ముందుగా భారత జాతీయ గీతం ఆలపించారు. ఆ సందర్భంగా ఆ మ్యాచ్ చూస్తున్న మద్యం ప్రియులు లేచి నిలబడి జనగణమన గీతాన్ని ఆలపించారు.

వారు జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ” పీకల దాకా మద్యం తాగినప్పటికీ వారు జాతీయ గీతాన్ని మర్చిపోలేదు. వారిలో ఉన్న భారతీయతను విస్మరించలేదు. జాతీయగీతం వినిపించగానే లేచి నిలబడ్డారు. అంతటి మద్యం మత్తులోనూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇంతకు మించిన భారతీయత ఇంకెక్కడ ఉంటుందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అన్నట్టు ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. అనేక సామాజిక మాధ్యమ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది.. జాతీయ గీతం వినిపిస్తున్నంత సేపు మందుబాబులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్రమశిక్షణను పాటించడం.. జాతీయ గీతాన్ని ఆలపించడం విశేషం. ఆ సమయంలో బార్ నిర్వాహకులు కొద్దిసేపు మద్యాన్ని విక్రయించకుండా అలాగే ఉండిపోవడం గమనార్హం.