OpenAI Sora : చాట్ జీపీటీ.. సాంకేతిక రంగంలో ఇది ఒక సంచలనం. దీనిని ఓపెన్ ఏఐ రూపొందించింది. దీని తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్ వేరు వేరు రూపాలలో రూపొందించినప్పటికీ చాట్ జీపీటీ స్థాయిలో విజయవంతం కాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాట్ జీపీటీ తోపు అనుకుంటుంటే.. అంతకు మించి అనేలాగా మరో దానిని తీసుకొచ్చింది.. దాని పేరు ‘సోరా’ అని నామకరణం చేసింది. ఇంతకీ ఇది ఏం చేస్తుందంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్స్ట్ టు వీడియో జనరేట్ తయారుచేస్తుంది. యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ కు అనుగుణంగా ఇది ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోను జనరేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓపెన్ ఏఐ సంస్థ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రకటించింది.
Prompt: “Several giant wooly mammoths approach treading through a snowy meadow, their long wooly fur lightly blows in the wind as they walk, snow covered trees and dramatic snow capped mountains in the distance, mid afternoon light with wispy clouds and a sun high in the distance… pic.twitter.com/Um5CWI18nS
— OpenAI (@OpenAI) February 15, 2024
“యూజర్ ప్రాంప్ట్ ఇస్తారు. దాని ఆధారంగా హై డీటెయిల్స్ కలిగిన 60 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను సొర రూపొందిస్తుంది. కెమెరా మోషన్లు అన్ని సమపాళ్లల్లో అందిస్తుంది. వివిధ పాత్రలను కూడా ఇది రూపొందిస్తుంది.. ఇది యూజర్లకు సరికొత్త అనుభూతి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభిన్నమైన సమాచారాన్ని అందిస్తుంది” అని ఓపెన్ ఏఐ ప్రకటించింది. కాగా, ఇప్పటికే గూగుల్ లూమియర్, రన్ వే ఏఐ, పికా 1.0 వంటివి టెక్స్ట్ టు వీడియో జనరేటర్లను తీసుకొచ్చాయి. అయితే ఇవి ఐదు సెకండ్ల నుంచి వీడియోలను జనరేట్ చేయలేవు. అయితే ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన జనరేటర్ దాదాపు పదిరెట్లు అధికంగా నిడివి ఉన్న వీడియోను జనరేట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ జనరేట్ చేసిన పలు వీడియోలను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. పలువురు యూజర్లు ఇచ్చిన ప్రాంప్ట్.. దానికి సోరా రూపొందించిన వీడియోలను ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చివరికి దొంగిలించిన ఇమేజ్ పోస్ట్ చేసినప్పటికీ దాని నుంచి వీడియో రూపొందించగలదని సామ్ పేర్కొన్నారు.
Prompt: “Animated scene features a close-up of a short fluffy monster kneeling beside a melting red candle. the art style is 3d and realistic, with a focus on lighting and texture. the mood of the painting is one of wonder and curiosity, as the monster gazes at the flame with… pic.twitter.com/aLMgJPI0y6
— OpenAI (@OpenAI) February 15, 2024
ఓపెన్ ఏఐ ఇంత గొప్పగా చెబుతున్నప్పటికీ.. సోరా లోనూ లోపాలున్నాయి. దీనికి సంబంధించి ఆ సంస్థ స్వయంగా అంగీకరించింది. కొన్ని సందర్భాల్లో ఈ వీడియో జనరేటర్ ప్రాంప్ట్ ను సరిగ్గా అర్థం చేసుకోలేక పోతోంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పండును కొరికిన తర్వాత అతడు చేసిన పంటి గాటును పంటి పై చూపించలేకపోతోంది. ఇలా వీడియోలు జనరేట్ చేయడం ద్వారా డీప్ ఫేక్ ముప్పు కూడా పొంచి ఉంది. అయితే అలాంటి ప్రమాదం లేదని ఓపెన్ ఏఐ ప్రకటించింది. తప్పుదోవ పట్టించే వీడియోలను రూపొందించకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఓపెన్ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే వీడియో జనరేట్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఓపెన్ ఏఐ ప్రకటించింది.
రెడ్ టీమర్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ లు, కొందరు క్రియేటర్లకు మాత్రమే వీడియో జనరేట్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్టు ఓపెన్ అయి ప్రకటించింది. ప్రొడక్ట్ గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేముందు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఓపెన్ వివరించింది. కాగా ఓపెన్ ఐ తీసుకొచ్చిన సోరా ప్రస్తుతం సాంకేతిక ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో సోరా బహుళ ప్రజాదరణ పొందిన అంశంగా నిలిచింది.