Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 17న ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం కలగనుంది. మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి గల నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త ఉద్యోగం పొందే అవకాశం. ఇతరుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు.
వృషభ రాశి:
ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో ఆస్తుల గొడవలు ఉండే అవకాశం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులు కాస్త కష్టపడాల్సి వస్తుంది.
మిథునం:
గతంలో నుంచి పెండింగులో ఉన్న సమస్యలు ఇబ్బంది పెడుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త చుట్టాలు ఇంటికి రావొచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగాలు మారడం అంత మంచిది కాదు. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. రాజకీయ రంగంలోని వారు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు.
సింహ:
వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూల వాతావరణం.
కన్య:
ఆర్థిక లావాదేవీల విషయంలో కొత్త వ్యక్తులను నమ్మొద్దు. కొందరితో వాదనలు చేస్తారు. వాటిని అక్కడికే ఆపేస్తే మంచిది. కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు.
తుల:
కటుుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
వృశ్చికం:
స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంటారు. అదనను ఖర్చులు పెరుగుతాయి. ఉద్యాగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు ఉంటాయి. ఇంటికి అథితులు వస్తారు.
ధనస్సు:
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది.
మకర:
విలువైన వస్తువుల విషయంలో అలసత్వం వీడాలి. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఆహ్లదరకమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాదనకు దిగుతారు.
కుంభం:
వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వ్యాపారులు పెట్టుబడి విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మీనం:
ఓ వ్యక్తి నుంచి బహుమతి అందుకుంటారు. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆన్ లైన్ లో ఉద్యోగం చేసేవారిని మోసం చేసే అవకాశం ఉంది.