https://oktelugu.com/

కొత్త రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ భారీ షాక్..?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు రేషన్ కార్డు ఎప్పుడు మంజూరు అవుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డుదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన జరిగిన కేబినేట్ భేటీలో తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునే […]

Written By: Kusuma Aggunna, Updated On : June 12, 2021 1:57 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు రేషన్ కార్డు ఎప్పుడు మంజూరు అవుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డుదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన జరిగిన కేబినేట్ భేటీలో తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం తాజాగా కొత్త అప్లికేషన్లను తీసుకోవద్దని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పడంతో గత మూడురోజులుగా మీసేవా సెంటర్ల ముందు, తహశీల్దార్ కార్యాలయాల ముందు జనాలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ సూచనలతో అధికారులు కొత్త దరఖాస్తులను తీసుకోవడం లేదని చెబుతుండటం గమనార్హం.

మరొవైపు గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరవుతాయా..? అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు. 5.63 లక్షల కొత్త రేషన్ కార్డులు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 4.46 లక్షల దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు నిరాశ తప్పడం లేదు.

మరోవైపు కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు మాత్రం ప్రభుత్వం వేగంగా రేషన్ కార్డును మంజూరు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరవుతాయో చూడాల్సి ఉంది.