
చేతికి ఎముకే లేకుండా సాయం అడిగిన వారి కల్లా కోట్లు ఖర్చు పెట్టి వారి బాధలు తీర్చిన రియల్ హీరో సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ వేళ ఈయన చేసిన సహాయం అంతా ఇంతాకాదు.. అందుకే ఆదుకున్న బాధితులంతా సోనూ సూద్ ను దేవుడిలా కొలుస్తున్నారు. సోను సూద్ స్వచ్ఛంద కార్యక్రమాలు కేవలం కోవిడ్ రోగులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇ-రిక్షాలు మరియు ఇతర మార్గాల ద్వారా ఉపాధి కల్పించడం నుండి వైద్య చికిత్స అందించడం వరకు ప్రజలకు సహాయపడటానికి సోనూసూద్ చేయని పనులు లేవు. తాజాగా అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆశావాదులకు ఉచిత కోచింగ్ కోసం స్కాలర్‌షిప్ ప్రకటించాడు. పేద విద్యార్థులకు ఈ గొప్ప వరం ప్రకటించాడు.
యూపీఎస్‌సి పరీక్షలు రాసి ఐఏఎస్‌లో చేరాలని కోరుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని సోనుసూద్ ప్రకటించాడు. ఈ మేరకు ‘సంభవం’ అనే ఐఏఎస్ కోచింగ్ శిక్షణ సంస్థ సహకారంతో దీన్ని ప్రకటించారు. పేద విద్యార్థులు ఎవరైనా సరే మీరు ఐ.ఏ.ఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటే, మేము మీ బాధ్యత తీసుకుంటాము అని సోనూ సూద్ ట్వీట్ చేశాడు. స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30 అని కూడా ఆయన వెల్లడించారు.
నెటిజన్లు సోనూ సూద్ చొరవను ప్రశంసించారు.. చాలా మంది విద్యార్థులు సోనూసూద్ ట్వీట్ పై స్పందించారు. చొరవ చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారిలో కొందరు ఐఏఎస్ శిక్షణలో చేరతామని పంచుకున్నారు. సోనూ సూద్ కు ‘సెల్యూట్’ అంటూ విద్యార్థులు పోగడ్తల వర్షం కురపించారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనూ సూద్ తాజాగా ప్రకటించారు. దీనిని ‘విప్లవాత్మక దశ’ అని పేర్కొన్నాడు. “ఈ మహమ్మారిలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు మద్దతుగా ముందుకు రావాలని మిగతా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మరియు కళాశాలలను నేను ఆహ్వానిస్తున్నాను. కలిసి మేము ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక కుటుంబాలను రక్షించగలము” అంటూ సోనూ సూద్ పిలుపునిచ్చాడు.
ఆసుపత్రి పడకలు, మందులు.. ఆక్సిజన్ సరఫరా వంటి కరోనా సంబంధిత సహాయం అందించినందుకు ఇప్పటికే సోను సూద్ వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. తన ముంబై నివాసంలో గుమిగూడుతున్న ప్రజలకు సహాయం అందించడం నుండి, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ మరియు మహీ విజ్ వంటి ప్రముఖులకు సహాయం చేయడం వరకు సోనూసూద్ ముందుడి నడిపిస్తున్న తీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు.
Karni hai IAS ki tayyari ✍️
Hum lenge aapki zimmedari 🙏🏻Thrilled to announce the launch of 'SAMBHAVAM'.
A @SoodFoundation & @diyanewdelhi initiative.Details on https://t.co/YO6UJqRIR5 pic.twitter.com/NvFgpL1Llj
— sonu sood (@SonuSood) June 11, 2021