Satellite Internet For Phones: సాంకేతిక అభివృద్ధి విషయంలో మనిషి అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఒకప్పుడు ఎదుటి వ్యక్తితో సంభాషించడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది.. సమాచార బదిలీని చేపట్టడానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఖండాంతరాలలో ఉన్నప్పటికీ లైవ్ లో మాట్లాడుకునే సౌలభ్యం కలుగుతోంది.. ఇది ఎక్కడదాకా దారితీస్తుందో తెలియదు.
అయితే నేటికీ సిగ్నల్స్ ఆధారంగానే ఫోన్ మాట్లాడేందుకు ఆస్కారం ఉంటుంది. సిగ్నల్ ఆధారంగానే ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడానికి అవకాశం ఉంటున్నది. అయితే సిగ్నల్స్ లో అంతరాయం చోటు చేసుకుంటే మాత్రం ఫోన్ మాట్లాడటం, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడం కుదరడం లేదు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి అమెరికా శాటిలైట్ తయారీ సంస్థ ఏఎన్టీ స్పేస్ సంస్థ సరికొత్త ఉపాయాన్ని ఆలోచించింది. తెరపైకి వినూత్నమైన ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఈ సంస్థతో ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మనం ఉపయోగించే ఫోన్ కు నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తారు.. ఏఎన్టీ అనేది మస్క్ ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ కు పోటీగా ఉంది. ఇది స్పేస్ ఆధారిత సెల్యులర్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ను తీసుకొచ్చింది. ఈ విభాగంలో తొలి సంస్థ కూడా ఇదే. కమర్షియల్ సర్వీస్, గవర్నమెంట్ అప్లికేషన్ ల కోసం దీనిని రూపొందించామని వోడాఫోన్ చెబుతోంది. మన దేశంలో మొబైల్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాలను విస్తరించడానికి ఏఎన్టీ తో వోడాఫోన్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. అంతరిక్షం ఆధారంగా.. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ లోనే వాయిస్, వీడియో కాల్స్ వంటి సౌలభ్యాన్ని ఏఎస్టీ స్పేస్ మొబైల్ అందిస్తోంది.
Also Read: Satellite Internet: అందరి జీవితాలు మారబోతున్నాయ్.. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్
ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందంటే..
ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేదా పరికరాలు, ఎటువంటి అప్డేట్స్ ఉపయోగం లేకుండానే ఇది పనిచేస్తుంది. స్పేస్ ఆధారంగానే ఈ సెల్యులర్ నెట్వర్క్ సేవలు అందిస్తుంది.. 4జి,5జి సేవలు అంతరిక్షం ఆధారంగానే అందుతాయి అంటే దీని బ్రాడ్ బ్యాండ్ ఎంతటి విస్తృతమైనదో అర్థం చేసుకోవచ్చు.. దీనిద్వారా కవరేజీ తో పాటు కనెక్టివిటీ కూడా సులభం అవుతుందని తెలుస్తోంది. సెల్ఫోన్ సిగ్నల్స్ అంతగా వెళ్లలేని ప్రాంతంలో కూడా మొబైల్ కనెక్టివిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది.. అయితే మస్క్ కు చెందిన టెలికాం విభాగం “డాట్” ఇంటర్నెట్ సేవలు అందించడానికి ప్రత్యేకంగా లైసెన్సులు మంజూరు చేస్తుంది. అయితే దీని ద్వారా సేవలు పొందాలి అనుకుంటే కచ్చితంగా ప్రత్యేకమైన పరాగాలను కొనుగోలు చేయాలి.. ఇక మస్క్ ఆధ్వర్యంలోని డాట్ కంపెనీలో ఇప్పటికే ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ భారీగా పెట్టుబడులు పెట్టారని వార్తలు వస్తున్నాయి. పందాలు కూడా కుదుర్చుకున్నాయని తెలుస్తోంది.. సునీల్ మిట్టల్, ముఖేష్ అంబానీ కంపెనీలకు మనదేశంలో టెలికాం విభాగంలో 70% వాటా ఉంది.. అయితే ఏ ఎస్ టి కంపెనీ మాత్రం ఎటువంటి పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ సేవలు అందించనుంది. అయితే ఈ సేవలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే విషయంపై ఇంతవరకు స్పష్టత లేదు.. ఇక వోడాఫోన్ కంపెనీ ఇప్పటికే ఏ ఎస్ టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అది గనక అందుబాటులోకి వస్తే దేశ టెలికాం చరిత్రలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంటున్నారు.