Samsung Galaxy : ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ప్రొడక్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ డిమాండ్ ఉంటుంది. శాంసంగ్ నుంచి విడుదల అయ్యే స్మార్ట్ ఫోన్లు సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యూజర్లను ఆకట్టుకునే విధంగా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తుంది కంపెనీ. ఈ ఫోన్లలో వచ్చే అడ్వాన్స్ డ్ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తుంటాయి. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ శాంసంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ భారీగా ఉంటుంది. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో మూడు మిడ్ రేంజ్ ఫోన్లను కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు – గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26. కంపెనీ ఈ కొత్త ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సెటప్‌తో వస్తాయి. ఈ ఫోన్లకు కంపెనీ 6 Android OS అప్‌డేట్‌లను, ఆరేళ్ల సేఫ్టీ అప్ డేట్లను అందజేస్తుంది. కంపెనీ కొత్త ఫోన్లు 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆఫన్లలో వస్తాయి. ఈ ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Galaxy A56 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో కంపెనీ 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ప్రాసెసర్‌గా దీనిలో Exynos 1580 చిప్‌సెట్‌ను అమర్చారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను వస్తుంది. 5000mAh బ్యాటరీ , ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.41,999.
Galaxy A36 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్రాసెసర్‌గా, ఫోన్‌లో అడ్రినో 710 GPUతో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 5000mAh..ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.32,999.
Galaxy A26 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ ఫోన్ 8GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్‌లో ప్రాసెసర్‌గా Exynos 1380 చిప్‌సెట్‌ను అమర్చింది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా , 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తుంది. దీనిలో బ్యాటరీ 5000mAh ఇచ్చింది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.