Samsung: ఆడవాళ్లకు “ఆ మూడు రోజులు” మహా నరకంగా ఉంటుంది. కొందరికైతే రక్తస్రావం అధికంగా ఉండటం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడతారు. కాళ్ల నొప్పులు, నడుం నొప్పులు అధికంగా ఉంటాయి. ఆ సమయంలో వారు తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఇతరులతో చెప్పుకోలేరు. అయితే చాలామంది ఆ మూడు రోజులను గుర్తుంచుకునేందుకు క్యాలెండర్ పై లేదా సెల్ ఫోన్ లో తేదీలను రౌండ్ ఆఫ్ చేసుకుంటారు. ఒక్కోసారి కాస్త ముందుగా లేదా కాస్త వెనకకు “ఆ మూడు రోజులు” చోటు చేసుకోవచ్చు. అయితే ఆ మూడు రోజులను గుర్తు పెట్టుకోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మర్చిపోవడం వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతారు. వాస్తవానికి ఇలాంటి బాధ వర్కింగ్ ఉమెన్స్ కు వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది.
అలాంటి మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Samsung ఒక వినూత్న పరికరాన్ని తయారుచేసింది. దానికి Samsung galaxy ring అని నామకరణం చేసింది.. ఇది పేరుకు రింగ్ మాత్రమే. కానీ చేసే పనులు మాత్రం అంతకుమించి అనే స్థాయిలో ఉంటాయి. ఇది మనిషి జీవనశైలిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుంది. Samsung health app లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చొప్పించడం వల్ల… అది ఒక మనిషికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్ రేట్, స్కిన్ టెంపరేచర్ వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. దీని ధర ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లలో 399 డాలర్లు, ఇండియన్ మార్కెట్లో 33 వేలకు Samsung విక్రయిస్తోంది. స్థానిక పన్నులు కలుపుకుంటే తీదర కాస్త అధికంగా ఉండొచ్చు. దీనికి సంబంధించి ప్రీ ఆర్డర్ ను సాంసంగ్ ప్రారంభించింది. జూలై నెల చివరి వారంలో డెలివరీ మొదలు పెడుతుంది.
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే పరికరాలను తయారు చేయడం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మెరుగైన పనితీరు లభిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దాని వినియోగాన్ని విస్తృతం చేస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం ఆవిష్కరించే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనివార్యమైపోతోంది. అయితే దాని ద్వారా.. మనిషి నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలను, ఇతర పనులను చేసేందుకు శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు.. అందువల్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన పరికరాలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపయోగాలు కూడా అదే స్థాయిలో ఉండడంతో వీటి వినియోగం పెరుగుతోంది. పైగా వినూత్నమైన పనులకు దీనిని ఉపయోగిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంసంగ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ తయారు చేసిన 5జి ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే నడుస్తోంది. భవిష్యత్తు కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మాత్రమే ఉపయోగించి పనిచేసే పరికరాలను రూపొందించాలని సాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, రవాణా రంగం వంటి వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే పరికరాలను ఉత్పత్తి చేసేందుకు సాంసంగ్ ప్రణాళికలు రూపొందించింది. తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇప్పటికే వీటికి సంబంధించి పనులు కూడా మొదలుపెట్టింది. వాటికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే.. పరికరాలను మార్కెట్లో ప్రవేశపెడతామని సాంసంగ్ చెబుతోంది. అయితే ఇందులో ఇతర సంస్థలు కూడా ఉండడంతో.. పోటీ అనేది తీవ్రంగా ఉంది. అయితే ఇతర సంస్థలు ఎటువంటి ఉపకరణాలను తయారు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.