త్వరలో మార్కెట్లోకి Samsung Galaxy M35.. ఫీచర్స్ అదిరిపోయాయి..

Samsung Galaxmy M 35 సిరీస్ మొబైల్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మోడల్ ఆమెజాన్ లో విక్రయానికి సిద్ధంగా ఉంచనున్నారు.

Written By: Neelambaram, Updated On : July 5, 2024 11:59 am

Samsung Galaxy M35 5G Launch Date in India

Follow us on

Samsung Galaxy M35:  Samsung మొబైల్స్ ను ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లు దాదాపు సక్సెస్ అయ్యాయి. Samsung Galaxyకి కొనసాగింపుగా కొత్తగా Samsung Galaxy M34 5G గత మే నెలలో మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని తరువాతి సిరీస్ M సీరీస్ ఈనెల 17న మార్కెట్లోకి వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మోడల్ జూలై 20 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ మొబైల్ ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో చూద్దాం..

Samsung Galaxmy M 35 సిరీస్ మొబైల్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మోడల్ ఆమెజాన్ లో విక్రయానికి సిద్ధంగా ఉంచనున్నారు. కొత్తగా వచ్చే ఈ ఫోన్ ముందుగా బ్లూ డార్క్, లైట్ కలర్లలో అందుబాటులో ఉండనుంది. అయితే Samsung Galaxy M35 5G ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారత్ లో జూలై 20 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxmy M 35 సిరీస్ డిస్ ప్లే 120 కలర్ రిప్రెష్ మెంట్ రేట్ తో ఉంది. ఇది వెయ్యి నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో మెరుగైన భద్రతా ఫీచర్ ను కలిగి ఉంది. ఇది 6.6 అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ ప్లేతో సూపర్ ఆమోలెడ్ ఇన్ఫినిటీ తో ఉంది. 1380 చిప్ సెట్ తోపాటు మాలి జీ68, ఎంపీ5 GPU గ్రాఫిక్ కార్డును ఇందులో అమర్చారు. గేమింగ్ కోసం యూజ్ చేసేవారికి ఈ ఫోన్ అనుగుణంగా ఉండనుంది.

ఈ మొబైల్ లో 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు మద్దతు ను కలిగి ఉన్న ఈ మొబైల్ యూఐ 6.1 ఆధారంగా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ప్లస్ 8ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్ ప్లస్ 2 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీ తో పాటు వీడియో కాల్స్ కోసం 13 ఎంపీ కెమెరా పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం 35 5 జీ స్మార్ట్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ అవకాశం కూడా ఉంది.