PhonePe New UPI Number Feature: మనీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఎవరికైనా డబ్బులు పంపించాలని అనుకున్నా.. ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలని అనుకున్నా.. అంతా మొబైల్ లోని యాప్ ల ద్వారానే చేస్తున్నారు. అయితే ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఎదుటివారికి యూపిఐ కి చెందిన నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆడవాళ్లు తమ యూపీఐ నెంబర్ ఇవ్వడం వల్ల ఆ తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఒక కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా పర్సనల్ నెంబర్ ఇతరుల వద్దకు చేరకుండా ఉంటుంది. మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Also Read: మార్కెట్లోకి మోటో 6జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మెంటలెక్కిపోద్ది..
సాధారణంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలని అనుకుంటే ఎదుటివారికి యూపీఐ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే యూపీఐ నెంబర్ లో ఫోన్ నెంబర్ తో పాటు చివరికి మూడు అక్షరాల ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. అంటే ఇందులో ఫోన్ నెంబర్ ఉంటుందన్నమాట. చాలామంది యూపీఐ చెల్లింపుల కోసం తీసుకున్న నెంబర్తో అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు యూపీఐ చెల్లింపు పేరిట అమ్మాయిల వద్ద నెంబర్లు తీసుకొని వారికి పర్సనల్ మెసేజ్లు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
Also Read: పవన్ ఫోటోలు తొలగింపు.. ఎవరి పని?!
యూపీఐ చెల్లింపులు చేయాలంటే ఇకనుంచి మొబైల్ లో ఉన్న నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా యూపీఐ నెంబర్ ఫోన్ పే లో అయితే మొబైల్ నెంబర్ తో పాటు@ybi అని ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిని మార్చుకొని కొత్త నెంబర్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెంబర్ను ఎదుటివారికి ఇవ్వడం వల్ల వారు పంపిన డబ్బులు ఈ అకౌంట్ లోకి జమవుతాయి. అయితే ముందుగానే మనం ఈ కొత్త నెంబర్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫోన్ పే యూస్ చేసే వాళ్ళు అయితే ప్రొఫైల్లోకి వెళ్లాలి. ఇక్కడ Manage Payments అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్లిన తర్వాత Upi Settings లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ UPI Number అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. వీటిలో ప్రైమరీగా ఏ బ్యాంకు ను ఎంచుకుంటారో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ADD అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 8 అంకెల మీకు ఇష్టం వచ్చిన నెంబర్ను ఎంటర్ చేసుకోవచ్చు. అయితే ఈ నెంబర్ ఇదివరకు వేరే వాళ్ళు యూస్ చేసి ఉంటే యాక్సెప్ట్ చేయదు. అలా నెంబర్లను మార్చుతూ వెరిఫై చేయాలి. ఏ నెంబర్ అయితే ఆక్టివ్ అవుతుందో ఆ నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా డబ్బులు చెల్లించాలి అనుకుంటే వారికి ఈ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఒక్కసారి మీకు ఈ నెంబర్ ఇచ్చారంటే మరెవరికి ఈ నెంబర్ ఇచ్చే అవకాశం ఉండదు.