Pan Card Aadhar Card Link: బ్యాంకు వ్యవహారాలు జరిపేవారు ఒకప్పుడు నేరుగా కార్యాలయానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేస్తున్నారు. దీంతో కొందరు పరిమితికి మించి ట్రాన్సాక్షన్ చేయడంతో వారికి పాన్ కార్డు అవసరం తప్పనిసరిగా మారుతుంది. ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు వేయాలి అనుకున్నా.. తీయాలి అని అనుకున్నా.. పాన్ కార్డు అవసరం ఉండేది కాదు. కానీ కార్యక్రమంలో డబ్బులు వేయడం, తీయడం మాత్రమే కాదు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకున్నా.. పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే ఈ పాన్ కార్డు విషయంలో 2025 డిసెంబర్ 31 లోపు ఈ పని చేయకపోతే ట్రాన్సాక్షన్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేయాలన్న… ఇన్కమ్ టాక్స్ పే చేయాలని అనుకున్నా.. కొత్తగా డిపాజిట్లు చేయాలని నిర్ణయించుకున్నా.. ఇలా పాన్ కార్డును ఇలా ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే?
ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. పాన్ కార్డు ఉంటేనే రూ. 50 వేలకు మించి ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. మిగతా వ్యవహారాల్లో కూడా పాన్ కార్డు లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలామంది పాన్ కార్డు తీసుకున్నారు. కానీ దీనిని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదు. పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల బ్యాంకు వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయితేనే బ్యాంక్ ట్రాన్సాక్షన్ సాఫీగా ఉంటాయి. అలాగే ఇన్కమ్ టాక్స్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. టీడీఎస్ అధికంగా కట్టాల్సి ఉంటుంది.
అందువల్ల పాన్ కార్డుతో, ఆధార్ కార్డు లింక్ తప్పనిసరిగా చేయాలని ఇప్పటికే బ్యాంకు అధికారులు డెడ్లైన్లు విధించారు. అయితే కొంతమంది తమ పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింకు చేశామని అనుకుంటున్నారు. కానీ వారి పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయిందా? లేదా అనేది తెలుసుకోవాలి. అందుకోసం www.incometax.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇందులో లింక్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయాలి. అలా చేసిన తర్వాత లింక్ అని ప్రెస్ చేయాలి. మీ పాన్ కార్డ్ తో ఆధార్ కార్డు లింక్ అయితే ఇదివరకే లింక్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఒకవేళ కాకపోతే ఆ తర్వాత కొన్ని వివరాలు అడుగుతారు. ఆ వివరాలను ఇవ్వడం వల్ల పాన్ కార్డుతో, ఆధార్ కార్డు లింక్ అవుతుంది.
అయితే ఆన్లైన్లో ఈ ప్రాసెస్ చేయలేము అని అనుకునేవారు బ్యాంకుకు వెళ్లి ఒక దరఖాస్తు చేసుకుంటే పాన్ కార్డుతో, ఆధార్ కార్డు లింక్ ను చేసుకోవాలి. ఈ పని 2025 డిసెంబర్ 31 లోగా చేసుకోవాలి. లేకుంటే ఆ తర్వాత బ్యాంకు వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.