Moto G100 6G Phone Launch Details: Technology డెవలప్ అయినకొద్దీ.. ఊహించిన డివైజ్ లుమార్కెట్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సాధారణ ఇంటర్నెట్ ఉంటే చాలు అనుకున్నాం. కానీ ఇప్పుడు అత్యంత స్పీడ్ కలిగిన నెట్ వర్క్ ఉండాలని కోరుకుంటున్నారు. యూజర్స్ ను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక నిపుణులు సైతం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. నిన్నటి వరకు మార్కెట్లో 5G మొబైల్స్ అలరించాయి. ఇదే అప్ గ్రేడ్ అనుకొని చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి 6G మొబైల్స్ వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో 6G అందుబాటులోకి వస్తుందన్న అంచనా రావడంతో.. ఇప్పటి నుంచే మొబైల్ కంపెనీలు అందుకు అనుగుణంగా 6G నెట్ వర్క్ కలిగిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Moto కంపెనీ ఒక అడుగు ముందుకు వేసింది. అందరికంటే ముందుగానే 6G మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. మరి ఈ ఫోన్ ఎలా ఉందో చూద్దాం..
Also Read: మీ వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా? కల్తీ పెట్రోల్ ను ఇలా గుర్తించండి..
ఇప్పటి వరకు Moto మొబైల్ కలిగిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా Moto G 100 6G మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ గురించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచారు. దీనిని భట్టి చూస్తే.. ఇది 6.7 అంగుళాల Amoled డిస్ ప్లేను కలిగి ఉంది. 120 HZ రిప్రెష్ రేట్ స్క్రోలింగ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అత్యధిక రిజల్యూషన్ కలిగిన వీడియోలను ఇందులో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో HDR+10 కలిగిన వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ మొబైల్ 12 జీబి Ram అక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీంతో ఇది ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా 6జీ రాబోతున్నందున అందుకు అనుగుణంగా పనిచేయడానికి దీనికి ఇంత ర్యామ్ ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇందులో 256జీబీ స్టోరేజ్ చేసుకోవచ్చు. అయితే 512 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉండనుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మొబైల్ కొనుగోలు చేసే సమయంలో కెమెరా పనితీరును బాగా గమనిస్తున్నారు. ఈ కొత్త ఫోన్ నేటి యూత్ కు అనుగుణంగా బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉన్నాయి. ఇవి 180 మెగా పిక్సెల్ తో పనిచేస్తాయి. అల్ట్రా వైడ్ లెన్స్, మాక్రో లెన్స్ తో పాటు డెప్త్ సెన్సార్ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఏఐ ఆప్షన్లను కూడా ఉంచారు. అలాగే 4 కె వీడియోలను రికార్డ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Also Read: పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. ఎలా పొందాలో తెలుసా?
6జీ వేగాన్ని తట్టుకునేందుకు Moto G 100 మొబైల్ లో 6000mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీతో గేమింగ్ స్ట్రీమింగ్ వంటివి కూడా వాడుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్ తో 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే ఈ మొబైల్ స్మార్ట్ నోటిఫికేషన్లను అందిస్తుంది. ఫింగర్ ఫ్రింట్ లాక్,మెరుగైన పనితీరును అందించే ఈ మొబైల్ 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే ఫీచర్స్ కలిగిన 5 జీ మొబైల్ ధర రూ.17,990 గా మార్కెట్లో ఉంది. దీనిని భట్టే ధర నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.