Oppo k13 turbo 5G: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తున్నా.. కొన్ని కంపెనీల ఫోన్లకు గుర్తింపు తగ్గకుండా ఉంటుంది. అయితే ఇవి కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడానికి అప్డేట్ అవుతూ వస్తుంటాయి. ప్రముఖ కంపెనీ OPPO లేటెస్ట్ గా K 13 Turbo 5G మొబైల్స్ తో ఆకర్షిస్తుంది. ఇది తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండడంతో పాటు ఫ్లాగ్ ఫిష్, స్టైల్ ఫీచర్స్, ఫోటోగ్రఫీ కావాలని కోరుకునే వారికి అనుగుణంగా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ కూడా ఆకట్టుకోనుంది. బలమైన బ్యాటరీ వ్యవస్థ ఉండడంతో రోజంతా వినియోగం చేసిన డౌన్ టైం తగ్గే అవకాశం ఉంది. మరి ఈ మొబైల్ ఫీచర్స్, ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ప్రతి మొబైల్ లో కెమెరా ప్రధానంగా చూస్తారు. Oppo k13 turbo 5G మొబైల్ లో 200 MP ప్రధాన కెమెరాలు అమర్చారు. ఇది హై రిజల్యూషన్ తో పాటు సెన్సార్ తో కూడిన ఫోటోగ్రఫీని అందిస్తుంది. వాస్తవాన్ని గ్రహించేలా చిత్రాలను తీస్తుంది. పగలు, రాత్రి రెండు సమయాల్లోనూ కావలసిన విధంగా ఫోటోలను తీసుకోవచ్చు. కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ మొబైల్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో స్లిమ్ ప్రొఫైల్, స్టైలిష్ ఫ్లాగ్ ఫిష్ వంటివి ఆకట్టుకోనున్నాయి. బెజెల్స్ తో కూడిన AMOLED డిస్ప్లే అందరికీ అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటివరకు వచ్చిన ఒప్పో మొబైల్స్ కంటే ఇది టర్బో 5జి కనుక.. ఇందులో సున్నితమైన స్క్రోలింగ్ తో పాటు అద్భుతమైన విజువల్స్ ను ఆస్వాదించవచ్చు. ఇది 120 Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉండడంతో అత్యధిక రిఫ్రెష్ రేట్ తో పాటు గేమింగ్ కు కూడా అనుగుణంగా ఉంటుంది. ఆకర్షణీయమైన రంగులను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో బలమైన 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ ని అమర్చారు. ఇది ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ తో పనిచేస్తుంది. డౌన్ టైం ను తగ్గించి రోజంతా వాడుకునేలా ఉపయోగపడుతుంది. అలాగే 5G కనెక్టివిటీతో వేగవంతమైన ఇంటర్నెట్ను పొందే అవకాశం ఉంటుంది. హై స్పీడ్ డౌన్లోడ్ ఆప్టిమైజ్ చేయడం వల్ల యూత్ కు బాగా నచ్చుతుంది. అలాగే అప్లోడింగ్ వీడియోలకు కూడా ఇది అనుగుణంగా ఉంటుంది.
ఇలాంటి ఆకర్షించే ఫీచర్లు కలిగిన Oppo k13 turbo 5G ధర ఎంతో ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ దీనిని రూ.10,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కొత్తగా మొబైల్ కొనాలని అనుకునే వారికి.. మంచి డిస్ప్లే కావాలని కోరుకునే వారికి.. ఇది ఎంతగానో నచ్చుతుంది. అలాగే కెమెరా పనితీరు కూడా మెరుగ్గా ఉండడంతో పాటు.. ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిస్ప్లేను కలిగి ఉండడంతో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ కొనుగోలు చేసినట్లు అవుతుంది.