Maruti Suzuki Wagon R 2026: కంపెనీకి దశాబ్దాలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఏ కారు అయినా కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఎక్కువగా మిడిల్ క్లాస్ రేంజ్ వారికి ఈ కంపెనీ కార్లు అనుగుణంగా ఉంటాయని చాలామంది ఆలోచన. అయితే గతంలో మార్కెట్లోకి వచ్చిన కొన్ని కార్లు ఇప్పటికి ఆదరణ పొందుతున్నాయి. వీటిలో wagon R ఒకటి. అతి తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ కారు కాలానికి అనుగుణంగా మారుతూ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఇది కొత్త రూపం సంతరించుకుంది. వ్యాగన్ఆర్ 2025 పేరుతో రిలీజ్ చేసిన ఈ మోడల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేందుకు మోడల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు Maruti Suzuki తన పాత కారు అయిన wagon R ను మార్చి మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఐకానిక్ టాల్ బాయ్ సిల్ఔట్ తో రిక్వెస్ట్ చేయబడింది. ముందు భాగంలో LED రన్నింగ్ లైట్లు అమర్చారు. బంపర్ ప్రీమియం కార్ల వాలే కనిపిస్తుంది. గతంలో కంటే విశాలమైన కారుగా ఇది గుర్తింపు పొందే అవకాశం ఉంది.
ఇన్నర్ విషయానికి వస్తే ఇందులో అప్గ్రేడ్ చేసిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, టచ్ స్క్రీన్ మ్యూజిక్, నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను అప్డేట్ చేశారు. స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలు డ్రైవర్లకు సౌకర్యంగా ఉండనున్నాయి. లోపల క్యాబిన్ లేఅవుట్ ఆకట్టుకోనుంది. ఇందులో దూర ప్రయాణాలు చేస్తే మంచి అనుభూతి కలిగే అవకాశం ఉంది. సీటింగ్ కుషన్ చేయబడ్డాయి. ఆకట్టుకునే డాష్ బోర్డు లేఅవుట్ తో పాటు మెరుగైన మెటీరియల్స్ తో తయారు చేశారు. చిన్న చిన్న వస్తువులను స్టోర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా క్యాబిన్ ను తీర్చిదిద్దారు.
వ్యాగన్ఆర్ ఇప్పటికే మంచి మైలేజ్ తో వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా అదే సామర్థ్యంతో పని చేసే అవకాశం ఉంది. వన్ పాయింట్ జీరో పెట్రోల్ ఇంజన్ అమర్చడంతో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉండడంతో లీటర్ ఇంధనానికి 34 కిలోమీటర్ల మైలేజ్ వరకు వెళ్లవచ్చు. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. ఇక ఈ కారును లేటెస్ట్ డిజైన్తో అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ధర విషయంలో మార్పు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రూ.4.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. అదనపు ఫీచర్లు కావాలంటే ధర పెరిగే అవకాశం ఉంటుంది.