Oneplus 16 R: స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో వన్ ప్లస్ మరోసారి భారీ సంచలనానికి సిద్ధమైంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే విధంగా అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనిని విదేశాలలో oneplus Ace 7 పేరుతో విడుదల చేస్తుండగా.. మనదేశంలో oneplus 16 R పేరుతో విడుదల చేస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా ప్రకటన చేయలేదు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న లీకుల సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ అంతకుమించి అనే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మోడల్ ఫోన్ లో 6.78 అంగుళాల ప్లాట్ ఎల్టిపిఎస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 1.5 కే రిజల్యూషన్ తో పాటు 185 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ ఉన్నట్టు సమాచారం. సాధారణంగా స్మార్ట్ ఫోన్లో 120 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ కనిపిస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లో 144 హెచ్ జెడ్.. 165 హెచ్ జెడ్ వరకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 185 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ కనుక నిజమైతే గేమ్స్ ఆడే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అన్ని యాప్స్.. గేమ్స్ 185 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తాయా లేదా అనేది చూడాలి.
ఈ ఫోన్లో క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. ఇది అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది.. ఈ చిప్ సెట్ తో భారీ గేమ్స్ ఆడటం.. 4 కె వీడియోలు ఎడిట్ చేయడం.. మల్టీ టాస్కింగ్ చేయడం వంటి పనులు వేగంగా పూర్తి చేయవచ్చు.Ace 7, Ace 7 Pro మోడళ్లకు వేరువేరు చిప్ సెట్లు ఉండే అవకాశం ఉంది. మనదేశంలో విడుదలయ్యే 16 R లో ఏ ప్రాసెసర్ ఉంటుందనేది అధికారిక ప్రటన ద్వారానే తెలుస్తుంది.
ఈ మోడల్ ఫోన్లో 200 మెగా ఫిక్సల్ ప్రధాన కెమెరా ఉండవచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ కెమెరాలు అధిక నాణ్యతతో ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. జూమ్ చేసినప్పుడు కూడా ఫోటోల వివరాలు స్పష్టంగా కనిపించడానికి అధిక మెగాపిక్సల్ సెన్సార్ ఉపయోగపడుతుంది. ఇక ప్రో మోడల్ లో టెలిఫోటో కెమెరా
.. 3.5 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటుందని సమాచారం. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్లో అందర్నీ ఆశ్చర్యపరచే విధంగా మరో ఫీచర్ భారీ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. 9,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. సాధారణంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో 5000 నుంచి 7000 ఎం ఏ హెచ్ మధ్య బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అలాంటిది 9000 బ్యాటరీ అందుబాటులోకి వస్తే భారీ గేమ్స్ ఆడే వారికి, ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించేవారికి ప్రయోజనం లభిస్తుంది.
సాధారణంగా గేమింగ్ సమయంలో ప్రాసెసర్ పై ఒత్తిడి పెరిగి ఫోన్ వేడెక్కుతుంది. దీనివల్ల పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి ప్రత్యేక కూలింగ్ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్లోనే చిన్న కూలింగ్ ఫ్యాన్ ఉండడంతో వేడిని బయటికి పంపించే వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే గేమింగ్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో వన్ ప్లస్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అయితే మన దేశంలో ఈ ఫోన్ ధర మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 70000 నుంచి 75 వేల మధ్యలో ఈ ఫోన్ ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ వేరియంట్.. ఫీచర్లు.. మార్కెట్ పరిస్థితులను బట్టి ధర మారే అవకాశం ఉంది.