https://oktelugu.com/

Old Method Job Application : ఉద్యోగం కోసం పాత పద్ధతిలో దరఖాస్తు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!

నేడు ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే.. ఆన్‌లైన్‌లో రెజ్యూమ్‌ పంపించాలి. ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. కానీ పాత పద్ధతిలో ఉద్యోగ దరఖాస్తు ఇలా ఉండేది కాదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 3, 2024 / 05:45 PM IST
    Follow us on

    Old Method Job Application :  సాధారణంగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలంటే.. ఇప్పుడు అందరూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతోపాటు చిన్న చిన్న సంస్థలు కూడా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన తరుణంలో జాబ్‌లకు లెటర్స్‌ పంపించడం కనుమరుగైంది. కానీ ఇటీవల ఓ వ్యక్తి జాబ్‌ కోసం లెటర్‌ పంపించినట్లు తెలిసింది. దీనికి సబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల వెరైటీ రెజ్యూమ్‌లకు ఆదరణ పెరుగుతోంది. తమ గురించి తాము ఎంత ఎక్కువా, ఎంత వెరైటీగా ఎక్స్‌ప్రెస్‌ చేస్తే.. అంతగా అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఓ ఉద్యోగి ఇలా పాత పద్ధతిని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

    డిజైనర్‌ ఉద్యోగానికి దరఖాస్తు..
    ఏఐని ఉపయోగించి రెజ్యూమ్‌లు తయారు చేస్తున్న ఈ కాలంలో ఓ వ్యక్తి పోస్టు ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేయడం.. దీనికి అప్లయ్‌ చేస్తూ ఓ లెటర్‌ రాసి స్విగ్గీ డిజైన్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిఎడంట్‌ సప్తర్షి ప్రకాశ్‌కు పంపించారు. ఈ లేఖ అందుకున్న తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. లెటర్‌ ఫొటోలను తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.‘భౌతికంగా ఒక లేఖ అందుకున్నాను. డిజిట్‌ యుగంలో స్కూల డేస్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్‌ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఎపెనింగ్స్‌ లేవు. కానీ, దయ చేసి నాకు ఈ మెయిల్‌ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్‌ ఓపెనింగ్‌ ఉద్యోగాల గురించి ఎవరికైనా తెలిస్తే నాకు మెయిల్‌ చేయండి’ అని స్విగ్గీ డిజైన్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు ట్వీట్‌ చేశారు.

    వైరల్‌ అవుతున్న ఫొటోలు..
    ఇక మాన్యువల్‌ లెటర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఉద్యోగార్థుల సృజనాత్మకత, నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్‌ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్టు చేయడం.. చూడడం రిఫ్రెష్‌గా ఉందని ఒకరు కామెంట్‌ చేశారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్‌ పెడుతున్నారు.