IND VS NZ 3rd Test : రిషబ్ పంత్ క్రీజ్ లో ఉన్నంతవరకు విజయం భారత జట్టు వైపే ఉంది. అయితే అతడు అనూహ్యకర నిర్ణయంతో అవుట్ అయ్యాడు. థర్డ్ ఎంపైర్ తీసుకుని నిర్ణయం వల్ల రిషబ్ అవుట్ కావడం టీమిండియా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ తీసుకొని నిర్ణయం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. పంత్ ప్యాడ్ కు బ్యాట్ తాకింది. అల్ట్రా ఎడ్జ్లో అది కనిపించింది. రీడింగ్ కూడా చూపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్ అని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయంపై రిషబ్ పంత్ అంపైర్లతో చర్చించాడు. న్యాయం జరగకపోవడంతో కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్నాడు. చివరికి పట్టరాని దుఃఖంతో మైదానాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
అంతకుముందు 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దారుణమైన ఓటమి దిశగా భారత జట్టు వెళుతుండగా.. రిషబ్ పంత్ వీరోచితంగా పోరాటం చేశాడు. 57 బంతుల్లో ఏకంగా 64 పరుగులు చేశాడు. గెలుపు పై ఆశలు పుట్టించాడు. 9 ఫోర్ లు కొట్టాడు. ఒక సిక్సర్ కొట్టాడు. టి20 లెవెల్ బ్యాటింగ్ చేశాడు. అయితే పంత్ అవుట్ కావడం ఒక్కసారిగా టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. అజాజ్ పటేల్ విసిరిన బంతిని డిఫెన్స్ చేయడానికి పంత్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి ప్యాడ్ కు తగిలింది గాలిలోకి లేచించింది. ఆ బంతిని వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ అందుకున్నాడు. అంపైర్ కు అప్పిల్ చేశాడు. ఫీల్డ్ ఎంపైర్ నాట్ అవుట్ అని ప్రకటించాడు. అయితే న్యూజిలాండ్ జట్టు అంపైర్ రివ్యూ కోసం వెళ్ళింది. చేతిలో ఒకే రివ్యూ ఉన్న నేపథ్యంలో.. పంత్ వికెట్ కావడంతో న్యూజిలాండ్ ధైర్యం చేసింది. అల్ట్రా ఎడ్జ్ ప్రాతిపదికగా అంపైర్ పంత్ అవుట్ అని ప్రకటించాడు. అయితే ఆ రీడింగ్ చూపించే సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్ కు తగిలింది. అందువల్లే ఆల్ట్రా ఎడ్జ్ అలా చూపిస్తోందని పంత్ ఫీల్డ్ ఎంపైర్లకు వివరించాడు. అయితే బంతి గమనం ఒక్కసారిగా మారిందని, అందువల్లే అవుట్ ఇచ్చానని థర్డ్ అంపైర్ తన రివ్యూల పేర్కొన్నారు.. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన టీమిండియా అభిమానులు ఆల్ట్రా ఎడ్జ్ రీడింగ్ సమయంలో బ్యాట్ – బంతికి గ్యాప్ ఉందని చెబుతున్నారు. పంత్ అవుట్ కాదని.. అతడు అవుట్ కావడం వల్ల టీమిండియా ఓడిపోయిందని పేర్కొంటున్నారు.. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల అవుట్ అయ్యాననే బాధతో పంత్ నిరాశతో మైదానాన్ని వీడిపోయాడు. ఈ మ్యాచ్లో భారత్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు 147 రన్స్ టార్గెట్ విధించగా.. దానిని చేదించడంలో టీమిండియా విఫలమైంది. 29.1 ఓవర్లలోనే 121 రన్స్ చేసి కుప్పకూలింది. అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టాడు. ఫిలిప్స్ 3 వికెట్లు సాధించాడు. హెన్రీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపు ద్వారా టీమిండియాను న్యూజిలాండ్ నేలకు దించింది. మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో దక్కించుకుని.. అద్భుతమైన రికార్డు సృష్టించింది.
I think it was the bat hitting the pad that made the disturbance on ultra-edge.
Rishabh Pant was also trying to explain the same thing to the umpires.
That’s why we need HotSpot + UltraEdge in DRS. pic.twitter.com/77Tw7LcrAp
— Johns (@JohnyBravo183) November 3, 2024