https://oktelugu.com/

Ka’ Movie  Collections :  కిరణ్ అబ్బవరం ‘క’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..మాస్ సెంటర్స్ లో ‘దేవర’ కి కూడా ఇలాంటి రన్ లేదుగా!

మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి మూడు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయి?, బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 06:00 PM IST

    Ka' Movie  Collections

    Follow us on

    Ka’ Movie  Collections :  మీటర్’, ‘రూల్స్ రంజన్’ లాంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కొంతకాలం గ్యాప్ తీసుకొని, ‘క’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో దీపావళి కి మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ నుండే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా, విడుదల తర్వాత మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి మూడు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయి?, బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము.

    కొత్త తరహా కథలకు నైజాం ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరో ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఒక సినిమా బాగుంటే కళ్ళు చెదిరే వసూళ్లు వస్తుంటాయి. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. ఇప్పుడు ‘క’ చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది. మూడు రోజులకు గాను ఈ సినిమాకి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అదే విధంగా సీడెడ్ లో కోటి 18 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 3 కోట్ల 22 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు.

    ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో మొదటి రెండు రోజులు అసలు సినిమా విడుదలే లేదు. నిన్న సాయంత్రం నుండి ఆ ప్రాంతంలో షోస్ యాడ్ అయ్యాయి. అదే విధంగా ఓవర్సీస్ లో కూడా అనుకున్న స్థాయి వసూళ్లు రావడం లేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు నార్త్ అమెరికా వంటి దేశాల్లో అవలీలగా 1 మిలియన్ గ్రాస్ వసూళ్లు వస్తుంటాయి. కానీ ఈ చిత్రానికి ఇంకా 4 లక్షల డాలర్లు కూడా రాకపోవడం గమనార్హం. కారణం టాక్ కి తగ్గ షోస్ లేకపోవడమే అని అంటున్నారు. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఓవర్సీస్ లో కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, బ్రేక్ ఈవెన్ కి మరో ఆరు కోట్ల రూపాయిలు రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ గా నిలవబోతుంది ఈ చిత్రం. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయట. కానీ వర్కింగ్ డేస్ లో ఎంత వరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.