https://oktelugu.com/

Mysteries of space : భూమి, చంద్రుడే కాదు.. నక్షత్రాలు కూడా సంచరిస్తుంటాయి.. ఎందుకంటే?

అలాంటి సమయంలో కొన్ని నక్షత్రాలు బయటికి వస్తాయట. ఒక్కోసారి బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలంతో ఢీ కొట్టినప్పుడు అవి నక్షత్రం మండలం అవతల వైపునకు వస్తాయని కొన్ని సిద్ధాంతాలు పేర్కొంటున్నాయి. అయితే స్థిరంగా, స్థితప్రజ్ఞతకు పర్యాయపదం లాంటి నక్షత్రాలు, అటూ ఇటూ సంచరించడం, నక్షత్ర మండలాల మధ్య తిరగడం ఇప్పటికీ ఒకింత ఆశ్చర్యమే.

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2024 / 09:31 PM IST

    stars are moving

    Follow us on

    Mysteries of space : భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది.. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు.. ఇలానే కదా మనం చిన్నప్పుడు చదువుకున్నాం.. మొదట్లో ఇంత పరిజ్ఞానం లేని సమయంలో భూ కేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించారు. ఆ తర్వాత ఇది తప్పని నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని చాలామంది వ్యతిరేకించారు. కానీ, నికోలస్ కోపర్నికస్ సైద్ధాంతికంగా వివరించడంతో అప్పటినుంచి సూర్యకేంద్రక సిద్ధాంతం మనుగడలో ఉంది. అయితే ఇప్పటివరకు భూమి, చంద్రుడు మాత్రమే సంచరిస్తాయని తెలుసు. అయితే నక్షత్రాలు కూడా సంచరిస్తాయని, అవి గ్రహాల మధ్య తిరుగుతాయని మీకు తెలుసా..

    ఖగోళ శాస్త్ర ప్రకారం నక్షత్రాలు నక్షత్ర మండలానికి పరిమితమైపోతాయి. కానీ కొన్ని నక్షత్రాలు మాత్రం ఆ మండలాల మధ్య సంచరిస్తుంటాయి. నక్షత్ర మండలంలో గురుత్వాకర్షణ ఉన్నప్పటికీ, నక్షత్రాలు దాని మీద ఆధారపడి ఉండవు. ఖగోళ శాస్త్ర పరిభాషలో ఇలాంటి నక్షత్రాలను సంచార నక్షత్రాలు అంటారు. వీటిని అంతర మండల నక్షత్రాలు, ధూర్త తారలు అని పిలుస్తుంటారు. ఇవి 1997లో వెలుగులోకి వచ్చాయి. నక్షత్ర మండలాలలో సుమారు 15 నుంచి 50% వరకు ఇలా సంచరించే నక్షత్రాలు ఉంటాయట. ఇక భూ గ్రహానికి సంబంధించి సమీప ప్రాంతాన్ని పరిశీలిస్తే పాలపుంత, ఆండ్రో మెడా నక్షత్ర మండలం మధ్య 675 సంచార నక్షత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి ఎలా పుడతాయో ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయారు.

    వీటి పుట్టుక సంబంధించి కొన్ని ఊహాగాన ఆధారాలున్నాయి. అంతరిక్షంలో చోటు చేసుకునే మార్పుల వల్ల కొన్ని నక్షత్రాలు పరస్పరం ఢీ కొట్టుకుంటాయి. అందులో కొన్ని నక్షత్రాలు బయటపడతాయి. అలా బయటపడిన నక్షత్రాలు నక్షత్ర మండలాల ఖాళీ ప్రాంతాల్లోకి వచ్చి చేరి, ఇలా మారతాయట. అలా చిన్న నక్షత్ర మండలాలల్లో ఏర్పడి, వాటి గురుత్వాకర్షణ శక్తిని దాటి వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారీ నక్షత్ర మండలాలు పరస్పరం ఢీకొట్టుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి అస్తవ్యస్తమవుతుందట. అలాంటి సమయంలో కొన్ని నక్షత్రాలు బయటికి వస్తాయట. ఒక్కోసారి బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలంతో ఢీ కొట్టినప్పుడు అవి నక్షత్రం మండలం అవతల వైపునకు వస్తాయని కొన్ని సిద్ధాంతాలు పేర్కొంటున్నాయి. అయితే స్థిరంగా, స్థితప్రజ్ఞతకు పర్యాయపదం లాంటి నక్షత్రాలు, అటూ ఇటూ సంచరించడం, నక్షత్ర మండలాల మధ్య తిరగడం ఇప్పటికీ ఒకింత ఆశ్చర్యమే.