WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ పై కొత్త ఫీచర్.. అదిరిపోయిన అప్డేట్

స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వాట్సాప్‌లో స్టేటస్‌ అప్‌డేట్‌ చేయడంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుక కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తోంది.

Written By: Raj Shekar, Updated On : December 27, 2023 8:47 am

WhatsApp New Feature

Follow us on

WhatsApp New Feature: వాట్సాప్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువ ఆదరణ ఉన్న యాప్‌. ఈ ఫీచర్‌తో సమాచారాన్ని చేరవేయడంతోపాటు స్టేటస్‌ ఆప్షన్‌ ద్వారా మన ఆలోచన విధానాన్ని ఇతరులకు తెలియజేసే అవకాశం ఉంది. మనకు నచ్చిన, మనం మెచ్చిన ఫోటో, వీడియో, ఆడియోను స్టేటస్‌గా పెట్టుకునేలా వాట్సాప్‌ అప్‌డేట్‌ అవుతూ వచ్చింది. తాజాగా స్టేటస్‌ కోసం మరో కోత్త అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. కొత్తగా తీసుకు వచ్చే ఫీచర్‌తో వెబ్‌ వర్షన్‌ నుంచి కూడా స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది. వాట్సాప్‌ బీటా వర్షన్‌లో ఈ ఫీచన్‌ టెస్టింగ్‌ ఇప్పటికే ప్రారంభించారు.

స్టేటస్‌ అప్‌డేట్‌ సమస్య తీరినట్టే..
స్మార్ట్‌ ఫోన్‌ నుంచి వాట్సాప్‌లో స్టేటస్‌ అప్‌డేట్‌ చేయడంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుక కొత్త ఫీచర్‌ను తీసుకు వస్తోంది. ఈ ఫీచర్‌ వచ్చిన తర్వాత వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి కూడా స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు స్టేటస్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. బీటా వినియోగదారులు ఉన్న యూజర్లు ఈ ఫీచర్‌ను యాప్‌ అండ్‌ వెబ్‌లో చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ కంపానియన్‌ మోడ్‌లో ఒక భాగం. ఈ ఫీచర్‌ యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌కు లాగిన్‌ చేసే అవకాశం ఇస్తుంది. ఈ మోడ్‌లో ప్రైమరీ ఫోన్‌ను ఇంటర్నెట్‌ కనెక్ట్‌ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

ల్యాప్‌టాప్, పీసీ ద్వారా కూడా..
ఈ కొత్త ఫీచర్‌ వచ్చిన తర్వాత వాట్సాప్‌ వినియోగదారులు తమ సొంత ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌(పీసీ) నుంచి కూడా వాట్సాప్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకాలం స్మార్ట్‌ ఫోన్‌ నుంచి మాత్రమే స్టేటస్‌ అప్‌డేట్, మార్చుకునే వీలుండేంది. కానీ, కొత్త ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వర్షన్‌ 2.24.1.4లో కనిపిస్తుంది.