Pallavi Prashanth: హీరోగా పల్లవి ప్రశాంత్… మైండ్ బ్లోయింగ్ మేటర్ లీక్ చేసిన కంటెస్టెంట్

వారం వారం పుంజుకున్న పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. అమర్ దీప్ రెండో వారం పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడం ప్లస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ మీద జనాల్లో సింపథీ ఏర్పడింది.

Written By: NARESH, Updated On : December 27, 2023 8:52 am

Pallavi Prashanth

Follow us on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ త్వరలో హీరో కాబోతున్నాడట. అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారట. ఈ మేరకు తోటి కంటెస్టెంట్ భోలే కీలక కామెంట్స్ చేశాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సత్తా చాటాడు. అతడు టైటిల్ కొడతాడని ఎవరూ ఊహించలేదు. శివాజీ, అమర్, ప్రియాంక, శోభ వంటి టాప్ సెలెబ్స్ లో ఒకరు టైటిల్ గెలుస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

వారం వారం పుంజుకున్న పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. అమర్ దీప్ రెండో వారం పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడం ప్లస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ మీద జనాల్లో సింపథీ ఏర్పడింది. ఆ సింపథీ కాస్త అభిమానంగా మారింది. కారణంగా… పల్లవి ప్రశాంత్ ఆట తీరు. టాస్క్ లలో ప్రశాంత్ తో పోటీ పడాలంటే భయపడేవారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్, కాన్సన్ట్రేషన్ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ సత్తా చాటాడు.

మొత్తంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే అతని అత్యుత్సాహం జైలుపాలు చేసింది. అన్నపూర్ణ స్టూడియో ఎదుట అల్లర్లు జరుగుతున్న క్రమంలో విన్నర్ అయిన ప్రశాంత్ ని వెనుక గేట్ నుండి పోలీసులు పంపించారు. అభిమానులను కలవొద్దు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని చెప్పారు. వినకుండా ప్రశాంత్ ర్యాలీ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. బెయిల్ పై బయటకు వచ్చాడు.

కాగా పల్లవి ప్రశాంత్ కి హీరో ఆఫర్స్ వస్తున్నాయట. ఆయనతో సినిమా చేసేందుకు చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. పాట బిడ్డ భోలే షావలి ఈ విషయం తెలియజేశాడు. పల్లవి ప్రశాంత్ హౌస్లో ఉన్నప్పుడే సినిమా ఆఫర్స్ వచ్చాయి. అతడు బయటకు వచ్చాక చెప్పాలి అనుకున్నాను. అనూహ్యంగా అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికి కూడా ప్రశాంత్ హీరోగా, నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలని మేకర్స్ సంప్రదిస్తున్నారు. అయితే ఇది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ప్రశాంత్ ఓకే అంటే… త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడని షాకింగ్ మేటర్ లీక్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.