Apple Smart Watch: యాపిల్ స్మార్ట్ వాచ్ లో సరికొత్త ఫీచర్.. ఇంతకీ ఇది ఏం పని చేస్తుందంటే?

ఎస్ ఓ ఎస్ ఫీచర్ కోవిడ్ సమయంలో చాలామందికి సంజీవని లాగా ఉపయోగపడింది.. అత్యవసర సమయంలో వైద్య సిబ్బందికి అత్యంత కీలక సమాచారాన్ని ఇచ్చి రోగి ప్రాణాలు కాపాడేందుకు సహాయపడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 8:45 am

Apple Smart Watch

Follow us on

Apple Smart Watch: యాపిల్ కంపెనీ నుంచి ఒక ఉత్పత్తి బయటకు వచ్చిందంటే.. అది ఏదో ఒక విధంగా మనిషికి ఉపకరిస్తూనే ఉంటుంది. యాపిల్ కంపెనీ కనిపెట్టిన ఉత్పత్తుల్లో అన్నీ బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం అదే. ముఖ్యంగా ఆ కంపెనీ ప్రతి ఏడాది ఆవిష్కరించే ఫోన్, స్మార్ట్ వాచ్ లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. అది మనిషికి ఏదో ఒక విధంగా ఉపకరిస్తూనే ఉంటుంది. యాపిల్ వాచ్ లో ఎస్ ఓ ఎస్ అనే పేరుతో ఒక ఫీచర్ ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎస్ ఓ ఎస్ ఫీచర్ కోవిడ్ సమయంలో చాలామందికి సంజీవని లాగా ఉపయోగపడింది.. అత్యవసర సమయంలో వైద్య సిబ్బందికి అత్యంత కీలక సమాచారాన్ని ఇచ్చి రోగి ప్రాణాలు కాపాడేందుకు సహాయపడింది. స్మార్ట్ వాచ్ లో ఉన్న ఎస్వోఎస్ ఫీచర్ రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని, ప్రతిరోజు మనం వేసే అడుగులు, ఖర్చు చేసే కేలరీలను ఇది లెక్క కడుతుంది. దానిద్వారా వైద్య సిబ్బందికి చికిత్స చేయడం చాలా సులభం అయింది.. అయితే ప్రస్తుతం ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ కు సంబంధించి మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక నివేదిక ప్రకారం యాపిల్ స్మార్ట్ వాచ్ పార్కిన్సన్స్ (మెదడుకు సంబంధించి తీవ్రమైన మతిమరుపు) లక్షణాలను గుర్తిస్తుందట. యాపిల్ ఎస్ ఓ ఎస్ చెప్పే విషయాలు వ్యాధిని అర్థం చేసుకోవడం, చికిత్సను అందించడంలో వైద్యులకు ఉపయోగపడుతుందట..

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచేస్టర్ మెడికల్ సెంటర్ లోని న్యూరాలజిస్టులు యాపిల్ స్మార్ట్ వాచ్ ను నిశితంగా పరిశీలించారు. దానిని ఒక సంవత్సరం పాటు ఉపయోగించారు. వారి పరిశీలనలో వాయిస్ రికార్డింగ్ ల ద్వారా.. వాయిస్ కు సంబంధించిన అనేక వివరాలు పార్కిన్సన్స్ వ్యాధిని అంచనా వేసేందుకు తోడ్పడుతున్నాయని వారు గుర్తించారు.. రోచేస్టర్ మెడికల్ సెంటర్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జామి ఆడమ్స్ చెప్పిన వివరాల ప్రకారం..” యాపిల్ స్మార్ట్ వాచ్ లో వాయిస్ రికార్డ్ మాటలో తేడాను గుర్తిస్తుంది. శరీరంలో జరుగుతున్న మార్పులను అంచనా వేస్తుంది. వీటిని క్లినికల్ ట్రయల్స్ లో వాడొచ్చు. రోగులకు వేగంగా చికిత్స చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చని” ఆయన పేర్కొన్నారు.

పార్కిన్సన్స్ వ్యాధిలో వణుకు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి వల్ల దైనందిన జీవితంలో చేసే పనులు కష్టమైపోతాయి. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు 12 నెలల పాటు యాపిల్ స్మార్ట్ వాచ్, ఇతర స్మార్ట్ ఫోన్ లను రిసెర్చ్ లో వైద్యులు ఉపయోగించారు. యాపిల్ స్మార్ట్ వాచ్ లోని ఎస్ ఓ ఎస్, ఫాల్ డిటెక్షన్ ఫీచర్ చాలామంది ప్రాణాలు కాపాడింది.. ఎస్ ఓ ఎస్ ఫీచర్ అత్యవసర సమయాల్లో వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.. ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్ అనుకోకుండా పడిపోతే హఠాత్తుగా యాక్టివేట్ అవుతుంది. అతిపెద్ద శబ్దంతో అలారం మోగిస్తుంది. అప్పటికి యూజర్ స్పృహలోకి రాని పక్షంలో వెంటనే కుటుంబ సభ్యులకు, అత్యవసర బృందాలకు సమాచారాన్ని పంపుతుంది. దీనివల్ల ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో అత్యవసర వైద్యాన్ని పొందారు.