Kalki 2898 AD: కల్కి సినిమా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతుందా..?

నిజానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా కావడం వల్ల ఈ సినిమాకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఏర్పడింది. అందువల్లే ఈ సినిమాని చూడడానికి ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాడంటూ రీసెంట్ గా ఒక సర్వేలో తెలిసింది. ఇ

Written By: Gopi, Updated On : June 16, 2024 8:49 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా మీద ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక పాన్ వరల్డ్ లో ఈ సినిమాగా తెరకెక్కించినప్పటికీ దీనిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మలేషియా, జర్మనీ లాంటి దేశాల్లో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక అక్కడ కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా కావడం వల్ల ఈ సినిమాకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఏర్పడింది. అందువల్లే ఈ సినిమాని చూడడానికి ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాడంటూ రీసెంట్ గా ఒక సర్వేలో తెలిసింది. ఇక ఇప్పటివరకు ఎవరి సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అని బాలీవుడ్ వాళ్ళు చేసిన సర్వేలో ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలిసింది. ఇక మొత్తానికైతే ప్రభాస్ గత సంవత్సరం ‘సలార్ ‘ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు కూడా మరోసారి అదే సక్సెస్ ను రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో భారీ రికార్డులను కొల్లగొట్టిన హీరోగా అవతరిస్తాడు. ఇక ఇంతకుముందే బాలీవుడ్ హీరోలందరికీ చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తే ఇంకా వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే కల్కి సినిమా ముందు కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అవి ఏంటి అంటే ఈ సినిమా అమీర్ ఖాన్ చేసిన ‘దంగళ్ ‘ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా అంటూ బాలీవుడ్ మీడియా కొన్ని కథనాలనైతే వెలువరిస్తుంది.

ఇక అలాగే ప్రభాస్ క్రియేట్ చేసిన బాహుబలి 2 రికార్డును కూడా ఈ సినిమా కొల్లగొడుతుందా.? ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఏ సినిమా క్రియేట్ చేయలేని రికార్డుని ఈ సినిమా క్రియేట్ చేస్తుందా.? అలాగే ప్రభాస్ నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతాడా అనే అన్ని క్వశ్చన్స్ కి ఈ ఒక్క సినిమానే సమాధానంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియదు…