Neuralink: న్యూరాలింగ్‌ అద్భుతం.. బ్రెయిన్‌లో చిప్‌.. డేటా ఏరేస్‌తో మళ్లీ..

సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా 2016లో పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బాగ్‌ రోడ్డు ప్రమాదానికి గురాయ్యడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరిగింది. పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితం అయ్యాడు.

Written By: Raj Shekar, Updated On : May 20, 2024 1:24 pm

Neuralink

Follow us on

Neuralink: ప్రపంచ కుబేరుడు.. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ కంపెనీ న్యూరో టెక్నాలజీలో మరో అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతం వచ్చిన ఓ యువకుడి బ్రెయిన్‌లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. తర్వాత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు.

లోపాలు సవరించి మళ్లీ..
చిప్‌ అమచ్చాక ఎందుకు సమస్యలు వచ్చాయే విశ్లేషించిన న్యూరాలింక్‌ కంపెనీ వైద్యులు.. వాటిని గుర్తించి సరిచేశారు. తర్వాత మళ్లీ దానిని యువకుడి బ్రెయిన్‌లో అమర్చారు. దీంతో ఇప్పుడతను చేతులతో పనిలేకుండా ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్‌తో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నాడు. టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

వీల్‌ చైర్‌కే పరిమితం..
సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా 2016లో పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బాగ్‌ రోడ్డు ప్రమాదానికి గురాయ్యడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరిగింది. పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితం అయ్యాడు.

ఎన్‌1 చిప్‌ సాయంతో..
మెడ కిందిభాగం వరకు చచ్చుబడి పోవడంతో తానే ఏ పని చేసుకోలేకపోయేవాడు. మానవ మెదడులో ఎలక్ట్రాటనిక్‌ చిప్‌ అమర్చే ప్రయోగాలు చేస్తున్న న్యూరాలింగ్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బాగ్‌ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఎన్‌1 అనే చిప్‌ను అమర్చింది.

ఎక్స్‌లో వెల్లడించిన మస్క్‌..
న్యూరాలింగ్‌ చేసిన ఈ ఆపరేషన్‌ గురించి యజమాని మస్క్‌ స్పందించారు. యువకుడికి చేసిన ఆపరేషన్‌ గురించి ఎక్స్‌లో వివరించాడు. ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్లు తెలిపాడు.

డేటా ఎరేస్‌తో సమస్య..
అర్బాగ్‌ బ్రెయిన్‌లో మొదట అమర్చిన చిప్‌తో సమస్యలు వచ్చాయి. దీంతో వైద్యులు దానిని తొలగించి పరిశీలించారు. చిప్‌లో డేటా ఎరేస్‌ కావడంతోనే సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. డేటాను తిరిగి రికవరీ చేసి చిప్‌ను మళ్లీ ఇంప్లాంట్‌ చేశారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడు.