NASA : నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అమెరికా పరిశోధన సంస్థ. ప్రపంచంలో చాలా దేశాలు నాసాపై ఆధారపడే సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి. పరిశోధనల సమాచారాన్ని పంచుకుంటున్నాయి. నాసా ఇప్పటికీ అనేక పరిశోధనలు చేస్తోంది. అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎన్‌ఎస్ కూడా చాలా వరకు అమెరికాలోని నాసా అధీనంలోనే ఉంది. ఇంకా అనేక పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి. తాజాగా చంద్రుడిపైకి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నాసా తమ ప్రణాళికలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా లూనార్ రెస్క్యూ సిస్టమ్ అభివృద్ధి చేస్తే 20 వేల డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 లక్షలకు పైమాటే) నజరానా ఇస్తామని ప్రకటించింది.
ఏమిటీ టెక్నాలజీ..
లూనార్ రెస్యూ్య సిస్టమ్ టెక్నాలజీ అంటే.. చంద్రుడిపై ఎవరైనా వ్యోమగాములు చిక్కుకున్న పరిస్థితిలో వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. దీనిని అభివృద్ధి చేసే అవకాశం ఓపెన్‌గా ఇచ్చింది. 2025, జనవరి 23వ తేదీలోపు ఔత్సాహికులు తమ ఐడియాలను హీరాక్స్ పోర్టల్‌లో సమర్పించాలని నాసా సూచించింది. చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లిన తర్వాత గాయం, మెడికల్ ఎమర్జెన్సీ, మిషన్ సంబంధిత ప్రమాదాలు జరిగితే వ్యోమగాములు అచేతన స్థితికి వెళ్తారు. అప్పుడు తోటి క్రూ సిబ్బంది వారిని లూనార్ ల్యాండర్ వద్దకు తిరిగి పంపాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్పేస్ సూట్ ధరించిన వ్యోమగాములను రోవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మేర తీసుకెళ్లాలి. దీనికి సబంధించిన డిజైన్ రూపొందించాలని నాసా పేర్కొంది.
బరువు తెలికగా..
సాధారణంగా జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీంతో బరువు తక్కువగా ఉంటారు. అయినా వారిని సాధారణ పరిస్థితిలో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం కషమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే లూనార్ రెస్క్యూ టెక్నాలజీ అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈమేరకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.