https://oktelugu.com/

Ambati Rambabu : వైసిపి భుజస్కందాలపై పుష్ప 2..అంబటి రాంబాబు టాప్ రివ్యూ

సాధారణంగా టాప్ హీరో సినిమా విడుదలైనప్పుడు.. హీరో ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి.. పూలదండల వరకు అభిమానులే ఏర్పాటు చేస్తారు. కానీ పుష్ప 2 విడుదల సమయంలో అభిమానుల బదులు వైసీపీ శ్రేణులు సందడి చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 5, 2024 / 04:09 PM IST

    Ambati Rambabu review on Pushpa 2

    Follow us on

    Ambati Rambabu : ప్రస్తుతం పుష్ప2 మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఈరోజు విడుదల అయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సందడి చేస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. థియేట వద్ద సందడి కూడా ప్రారంభం అయ్యింది. మంచి టాక్ కొనసాగుతోంది. సినిమాపై రివ్యూలు కూడా కొనసాగుతున్నాయి. వైసిపి శ్రేణులు ఈ సినిమాకు అండగార్ల నిలబడటం విశేషం. ఈ సినిమాను తన భుజాన ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా రివ్యూ ఇచ్చారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. నిన్న సాయంత్రమే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అందరూ ధియేటర్లకు వెళ్లి చూడాలని, ఆదరించాలని కోరారు. దానిని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేసింది.

    * శిల్ప రవి చంద్రారెడ్డితో బన్నీ
    అయితే ఎవరైతే వివాదానికి కారణమయ్యారు ఆయనతోనే అల్లు అర్జున్ సినిమా చూశారు. ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి చంద్రారెడ్డికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. అప్పుడే మెగా ఫ్యాన్స్ విభేదించారు. అప్పటినుంచి రచ్చ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిన్న అదే అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లోని సంధ్య 70 ఎం ఎం థియేటర్లో సినిమా చూశారు. అయితే ఈ ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే అల్లు అర్జున్ అదే వైసీపీ నేతతో కలిసి సినిమా చూడడం విశేషం.

    * వైసిపి ఫ్యాన్స్ శ్రద్ధ
    అయితే ఆది నుంచి ఈ సినిమా విషయంలో వైసీపీ శ్రేణులు ఎక్కడలేని శ్రద్ధ చూపుతున్నాయి. మెగా ఫ్యాన్స్ తో అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ ను విభజించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా టికెట్ల ధర పెంపు, ప్రీమియం షో ల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో అల్లు అర్జున్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం మరువరానిదని చెప్పుకొచ్చారు. అయినా సరే మెగా అభిమానులు అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గలేదు. సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు మధ్యలో వైసీపీ వారు వచ్చి గందరగోళం క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ఏకంగా అల్లు అర్జున్ తో పాటు జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మా కోసం నువ్వు వచ్చావు.. మీకోసం మేము వస్తాము… మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అనంతపురం జిల్లా గుత్తిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.