Pushpa 2: పుష్ప 2 మూవీ ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షో కలెక్షన్స్ తో కలిపి ఫస్ట్ డే రూ. 250 నుండి 300 కోట్ల గ్రాస్ ఉంటుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఆ రేంజ్ లో వసూళ్లు ఉన్నాయి. టికెట్ ధర రూ. 500లకు పైగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. థియేటర్స్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి.
లాంగ్ వీకెండ్ లో విడుదలైన పుష్ప 2… శుక్ర, శని, ఆదివారాల్లో మరింత మెరుగైన వసూళ్లు అందుకునే సూచనలు ఉన్నాయి. కాగా సామాన్య ప్రేక్షకులే కాదు, సెలెబ్స్ సైతం పుష్ప 2 చిత్రం చూసి ఫిదా అవుతున్నారు. తమ ఎగ్జైట్మెంట్, థ్రిల్ ని షేర్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ… పుష్ప 2 మూవీ చూశాడట. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా షార్ట్ రివ్యూ ఇచ్చాడు.
వావ్ అల్లు అర్జున్ సర్, పుష్ప 2 నా హృదయాన్ని తాకింది. మీ నటనకు సాటిలేదు. మరో బ్లాక్ బస్టర్ కొట్టినందుకు మీకు శుభాకాంక్షలు. అలాగే సుకుమార్ బ్రో… మీ టేకింగ్ నాకు నచ్చింది. మీరు పడ్డ కష్టం కనిపిస్తుంది. పుష్ప 2 యూనిట్ మొత్తానికి నా విషెష్. హీరోయిన్ రష్మిక మందాన కు ప్రత్యేకంగా సుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫహద్ మీరు నటనలో బీస్ట్… అంటూ అట్లీ రాసుకొచ్చారు. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ నటన అట్లీకి ఎంతగానో నచ్చాయట.
కాగా గతంలో అల్లు అర్జున్-అట్లీ కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దర్శకుడు అట్లీతో మూవీ మాత్రం ఉంటుందట. నెక్స్ట్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. కాగా పుష్ప 2 వసూళ్లు రూ. 1000 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని అంచనా. పుష్ప 2 వసూళ్లు మరో బాహుబలి 2 రేంజ్ లో ఉన్నా ఆశ్చర్యం లేదు.