Astronauts: వారం రోజుల పర్యటన కోసం 2024, జూలై 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్నారు. 9 నెలలపాటు వారు అంతరిక్షం(Space)లో చిక్కుకుపోయారు. భూమిపైకి వచ్చాక వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కీలకంగా మారాయి.
అంతరిక్ష కేంద్రంలో వాతావరణం భూమిమీద ఉన్నట్లుగా ఉండవు. భూమిపై గురుత్వాకర్షణ శక్తి(Gravity) ఉంటుంది. అంతరిక్షంలో అది ఉండదు. ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండడం వలన కండరాలు(Musils)బలహీనపడతాయి. ప్రతీనెల ఎకుమ సాంద్రత 1 శాతం తగ్గుతుంది. దీనివల్ల కాళ్లు, వీపు, మెడ ప్రభావితం అవుతాయి. ఫలితంగా భూమిపై వెంటనే నడవలేరు.
Also Read: ఐఎస్‌ఎస్‌ను వీడిన సునీత.. భూమ్మీదికి ప్రయాణం మొదలు..
నిలబడేందుకు ఇబ్బంది..
మెదడులో వెస్టిబ్యూలర్ వ్యవస్థ(Westibyular system) కూడా పనిచేయకపోవడంతో నిలబడం, శరీర సమతుల్యత కాపాడడం కష్టంగా ఉంటుంది. 2006లో హెడె మేరీ స్టెఫానిషిన్–పైపర్ అనే వ్యోమగామి 12 రోజుల తర్వాత ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.
నడక మర్పిపోవచుచ..
అంతరిక్షంలో వస్తువులు గాలిలో తేలుతాయి కాబట్టి, వ్యోమగాములు భూమిపై వచ్చిన తర్వాత కూడా వస్తువులను గాలిలో వదిలే అలవాటు కొనసాగవచ్చు. సున్నా–గురుత్వాకర్షణ వల్ల శరీర ద్రవాలు తల వైపు కదలడం కళ్లపై ఒత్తిడి కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో–ఓక్యులర్ సిండ్రోమ్ (SANS) అంటారు,
దృష్టిలోపం..
ఎముకల క్షీణత, అధిక రేడియేషన్ వల్ల క్యాన్సర్(Cancer) ప్రమాదం, డీఎన్‌ఏ(DNA) దెబ్బతినడం, రోగనిరోధక శక్తి తగ్గడం, గాయాలు మానకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.
మానసిక ఒత్తిడి..
9 నెలల ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, దృష్టి కేంద్రీకరణలో ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. భూమిపై దిగిన తర్వాత వీరికి వైద్య పరీక్షలు, రిహాబిలిటేషన్ అవసరం, శరీరం గురుత్వాకర్షణకు అలవాటు పడే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.