MS Dhoni : క్రికెట్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్స్ లో ఒకరు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). ఇండియన్ క్రికెట్ టీం కి సారథిగా ఆయన అందించిన విజయాలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. టీ20, టెస్ట్, ఒన్డే మ్యాచులకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ చూడడం మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్లేయర్ ఆయన. ప్రస్తుతం IPL సీజన్ లో ఇప్పటికీ యాక్టీవ్ గానే కొనసాగుతున్నాడు. ఈ వయస్సు లో కూడా యంగ్ స్టర్స్ ధోని కి బౌలింగ్ చేయాలంటే భయపడి పోతుంటారు. కారణం ఆయన కొట్టే సిక్సులు ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి. ఈ సీజన్ IPL లో కూడా ఆయన ఆడబోతున్నాడు. ఈ నెల 22 నుండి IPL సీజన్ మొదలు కానుంది. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ధోని సరికొత్త యాడ్ విడుదలైంది.
Also Read : అంబటి రాయుడు పంపిన బిర్యానీ కోసం హోటల్ మార్చేసిన ధోని పౌరుషం..
ఈ ’emotorad’ కోసం ఆయన ‘యానిమల్’ మూవీ స్టైల్ లో కనిపించి అభిమానులను ఉర్రూతలూ ఊగించాడు. ఈ యాడ్ లో సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కూడా ఉన్నాడు. ధోని స్టైల్, నడిచే తీరు, యాటిట్యూడ్ ని చూసి హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కంటే బాగా చేసావని ఆయన అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఈ యాడ్ చివర్లో ‘యానిమల్'(Animal Movie) మూవీ లాస్ట్ షాట్ ని ఇమిటేట్ చేశాడు. త్వరలో జరగబోయే IPL మ్యాచులలో ధోని అద్భుతమైన ఆట ఆడితే, ఆయన హేటర్స్ కోసం ఈ షాట్ ని చూపించి ఎగతాళి చేయొచ్చు అని అంటున్నారు. ధోని సినిమాలకు సరిపోతాడని, IPL నుండి కూడా రిటైర్ అయిపోయాక ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు ఆనందం తో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ధోని ఇలా ఒక సినిమాలోని సన్నివేశాన్ని అనుసరిస్తూ యాడ్స్ చేయలేదు. మొట్టమొదటిసారి అలాంటి యాడ్ చేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మీరు కూడా ఆ కమర్షియల్ యాడ్ ని చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
Also Read : ధోనికి ప్రతినెల బీసీసీఐ ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా?
సందీప్ వంగ దర్శకత్వంలో ఎం.ఎస్ ధోని న్యూ యాడ్
సినిమా రేంజ్లో యాడ్ ఉందంటున్న ధోని ఫాన్స్
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025