Homeట్రెండింగ్ న్యూస్Sunita Williams: ఐఎస్‌ఎస్‌ను వీడిన సునీత.. భూమ్మీదికి ప్రయాణం మొదలు..

Sunita Williams: ఐఎస్‌ఎస్‌ను వీడిన సునీత.. భూమ్మీదికి ప్రయాణం మొదలు..

Sunita Williams: గతేడాది జూలైలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌(Buch willmore).. వారం రోజులే అక్కడ ఉండాలి. కానీ అనివార్య కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. 9 నెలలపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉన్న ఇద్దరూ ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. స్పేస్‌ ఎక్స్‌ క్రూ(Space X Cru) వ్యోమనౌక మంగళవారం (మార్చి 18, 2025) ఉదయం 10:15 గంటలకు ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయి, భూమి వైపు పయనం మొదలుపెట్టింది. నాసా(NASA) ఈ అన్లాకింగ్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను సునిశితంగా పరిశీలించారు. సునీతా విలియమ్స్, విల్మోర్‌తో పాటు నిక్‌ హేగ్, అలెక్సాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఈ వ్యోమనౌకలో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం(TuesdaY) ఉదయం 8:15 గంటలకు హ్యాచ్‌ మూసివేత జరిగింది. అనంతరం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్‌ చేసి, క్రూ డ్రాగన్‌లోకి చేరారు. ఐఎస్‌ఎస్‌లో చివరి క్షణాల్లో వారు ఫొటోలు తీసుకున్నారు. ఈ వ్యోమనౌక భూవాతావరణంలోకి పునఃప్రవేశానికి బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ఇంజిన్‌ ప్రజ్వలన జరుగుతుంది. ఆ తర్వాత 3:27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగనుంది. సహాయ బృందాలు వ్యోమనౌకను వెలికితీస్తాయి.

Also Read: మైక్రో రిటైర్మెంట్‌.. ఉద్యోగ విరమణలో కొత్త ఒరవడి..!

జూలై 5న ఐఎస్‌ఎస్‌కు ప్రయాణం..
2024 జూన్‌ 5న బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సునీతా, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. వారం రోజుల్లో తిరిగి రావాల్సిన ఈ మిషన్, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఆ వ్యోమనౌక ఆగస్టులో వ్యోమగాములు లేకుండా భూమికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి వీరు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. నాసా స్పేస్‌ఎక్స్‌ సహాయంతో వీరిని తిరిగి తీసుకొస్తోంది. ఈ 9 నెలల్లో వీరు ఐఎస్‌ఎస్‌లో శాస్త్రీయ పరిశోధనలు, నిర్వహణ పనులు చేశారు. సునీతా రెండోసారి ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా పనిచేశారు. ఈ తిరుగు ప్రయాణం 17 గంటలు పడుతుంది. భూమిపై దిగిన తర్వాత వైద్య పరీక్షలు, రిహాబిలిటేషన్‌ జరుగుతాయి. ఈ సంఘటన వారి ధైర్యానికి, నాసా–స్పేస్‌ఎక్స్‌ సాంకేతికతకు నిదర్శనం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular