Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీBest Mobile Apps: ఈ 4 యాప్స్ మీ మొబైల్స్ లో తప్పనిసరిగా ఉండాలి..

Best Mobile Apps: ఈ 4 యాప్స్ మీ మొబైల్స్ లో తప్పనిసరిగా ఉండాలి..

Best Mobile Apps: ఇప్పుడంతా డిజిటల్ యుగం.. పేపర్ లెస్ వర్క్ చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. ప్రతీది ఆన్ లైన్ లో ఉండడంతో కొన్ని సంస్థలు పేపర్ తో కాకుండా ఆన్ లైన్ సమాచారాన్ని అడుగుతున్నారు. అంతేకాకుండా డాక్యుమెంట్స్ ప్రతీ చోట తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల యాప్స్ మొబైల్స్ లో ఉండే చాలా వరకు సౌకర్యంగా ఉండడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా రోజూవారీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వీటీలో ప్రభుత్వానికి సంబంధించిన ఈ నాలుగు యాప్స్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నాలుగు యాప్స్ ఏవి? అవి ఎలా ఉపయోగపడుతాయి?

mParivahan
ఈ యాప్‌ను Ministry of Road Transport and Highways రూపొందించింది. డ్రైవింగ్ లైసెన్స్, RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) డిజిటల్ కాపీలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్ చెకింగ్ సమయంలో ఫిజికల్ డాక్యుమెంట్లు లేకపోయినా యాప్‌లో చూపించవచ్చు. వాహనం వివరాలు, చలాన్లు, RC స్థితి కూడా తెలుసుకోవచ్చు. అయితే ముందుగానే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వాహనానికి సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది.

DigiLocker
Ministry of Electronics and Information Technology ఆధ్వర్యంలో పనిచేసే ఈ యాప్‌లో ఆధార్, PAN, డ్రైవింగ్ లైసెన్స్, మార్కుల మెమోలు, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు భద్రంగా నిల్వ చేయొచ్చు. అవసరమైనప్పుడు డిజిటల్ రూపంలో షేర్ చేయడం సులభం. కాగిత పత్రాలు మోసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. కొన్ని సార్లు డాక్యుమెంట్లు మరిచిపోయినప్పుడు ఇది అందుబాటులో ఉండి కావాల్సిన పనులను చేస్తుంది.

DigiYatra
Digi Yatra Foundation నిర్వహించే ఈ యాప్ విమానాశ్రయాల్లో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఎంట్రీ ఇస్తుంది. బోర్డింగ్ పాస్, ఐడీ చెకింగ్‌లో సమయం తగ్గుతుంది. ఒకసారి నమోదు చేసుకుంటే ఎయిర్‌పోర్ట్‌లో క్యూలో నిలబడే శ్రమ తగ్గుతుంది. తరచుగా విమాన ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరం.

RBI Retail Direct
Reserve Bank of India అందించిన ఈ యాప్ ద్వారా వ్యక్తిగత పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి మధ్యవర్తులు అవసరం ఉండదు. సురక్షిత పెట్టుబడులు కోరేవారికి ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు.

ప్రభుత్వ సేవలు వేగంగా పొందడానికి, డాక్యుమెంట్లు ఎప్పుడూ మొబైల్‌లో అందుబాటులో ఉండడానికి ఈ యాప్స్ తప్పనిసరి. అలాగే ప్రయాణంలో సమయం ఆదా కావడానికి, పెట్టుబడులు సురక్షితంగా నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper