Homeబిజినెస్Motorola Edge 70 Pro: Motorola నుంచి కొత్తగా వచ్చే ఫోన్స్ ఫీచర్స్ లీక్.. కలర్స్...

Motorola Edge 70 Pro: Motorola నుంచి కొత్తగా వచ్చే ఫోన్స్ ఫీచర్స్ లీక్.. కలర్స్ చూస్తే మతిపోతుంది..

Motorola Edge 70 Pro: Motorola కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లో మార్కెట్లోకి వస్తూ వినియోగదారులను ఆకర్షిస్తాయి. దీని నుంచి ఇప్పటికే వచ్చిన ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఎంతో మందిని ఆకర్షించింది. అయితే త్వరలో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో, రేజర్ 70 ఆల్ట్రా మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి ఈ ఏడాది మధ్యలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ పరోక్షంగా తెలిపింది. అయితే అంతకు ముందుగానే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని లీకులను ఇస్తోంది. ఈ రెండు మొబైల్స్ కలర్స్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ఏ మొబైల్ ఇలాంటి కలర్ లో లేదని వినియోగదారులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అసలు ఈ రెండు మొబైల్స్ ఎలాంటి కలర్ లో ఉన్నాయి? వీటిలో ఉండే ఫీచర్స్ ఏంటి?

మోటరోలా కంపెనీ ఈసారి ప్రీమియం వినియోగదారులను ఆకర్షించేందుకు లక్ష్యంగా పెట్టుకోండి. అందుకు అనుగుణంగా మొబైల్ లో అన్ని రకాల ఫీచర్స్ తో పాటు డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇందులో భాగంగా త్వరలో మార్కెట్లోకి రాబోయే మోటరోలా రేజర్ 70 ప్రో ఫోల్డబుల్ అనే ఫోన్ అన్న విషయం తెలిసిందే. ఈ ఫోల్డబుల్ మొబైల్ చాక్లెట్ కలర్ లో ఉండబోయే అవకాశం ఉంది. అలాగే ఎడ్జ్ 70 ప్రో మొబైల్ ఫాంటోన్ టైటాన్ అంటే నీలం కలర్లో ఆకర్షించనుంది. ఇప్పటివరకు ఈ కొత్త కలర్స్ ఏ మొబైల్ లో చూడలేదని కొందరు అంటున్నారు.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో మొబైల్ లో 6500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 90 W వైర్డ్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న 60 ప్రో లో ఉండే 6000 mAh కంటే 500 కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కర్వ్ డిస్ప్లే ఉండరు ఉంది. దీంతో ఇందులో మూవీస్ చూసేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెరుగైన టెలిఫోటో అందించే అవకాశం ఉంది. ఈ కెమెరా ఏఐ అసిస్టెంట్ జూమ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో OEM AI లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

అయితే మోటరోలా రేజర్ 70 ఆల్ట్రా మొబైల్ కు సంబంధించిన విషయాలు ఇప్పటివరకు తెలియలేదు. లీక్ అయిన దాని ప్రకారం ఇందులో 7 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే ఉండరు ఉంది. ఈ మొబైల్లో డ్యూయల్ కెమెరాను చూడొచ్చు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది. అయితే దీని విడుదలపై అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. కానీ ఆన్లైన్లో వీటి ఫోటోలను చూస్తే మాత్రం ఖచ్చితంగా సేల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper