Motorola Edge 50 Pro: ఆలసించినా.. ఆశాభంగం.. మోటోరోలా పై భారీ తగ్గింపు.. నేడే త్వరపడండి..

Artificial intelligence ద్వారా నడిచే స్మార్ట్ ఫోన్ ను మోటరోలా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి Edge 50 Pro అని పేరు పెట్టింది. ఇందులో A1 powered triple rear camera setup ఏర్పాటు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 9:57 am

Motorola Edge 50 Pro

Follow us on

Motorola Edge 50 Pro: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అధునాతన టెక్నాలజీ కలిగిన మోటరోలా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ వాడాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఆ కంపెనీ భారీగా ధర తగ్గించి ఫోన్ విక్రయాలు చేపడుతోంది. ఇంతకీ ఏ మోడల్ పై ఈ తగ్గింపు లభిస్తోంది? దాని ప్రత్యేకతలు ఏమిటో? ఈ కథనంలో తెలుసుకుందాం..

Artificial intelligence ద్వారా నడిచే స్మార్ట్ ఫోన్ ను మోటరోలా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి Edge 50 Pro అని పేరు పెట్టింది. ఇందులో A1 powered triple rear camera setup ఏర్పాటు చేసింది. IP 68 అండర్ వాటర్ ప్రొటెక్షన్, AI powered camera system కలిగి ఉన్న Edge 50 Pro 5G smartphone ను ఫ్లిప్ కార్ట్(Flipkart) మెగా జూన్ బోనాంజా సేల్ రూపంలో విక్రయిస్తోంది.

Edge 50 Pro smartphone ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లాంచ్ అయింది. ప్రారంభ ధర ₹31,999 గా ఉండేది. ఈ ఫోన్ 8GB+ 256 GB వేరియంట్ లో ఇది లభ్యమవుతోంది. వినియోగదారుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఫ్లిప్ కార్ట్ దీనిపై 2000 బిగ్ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం ₹29,999 కి తగ్గింది. మరోవైపు ₹36,999 కి లభ్యమయ్యే 12GB + 256 GB వేరియంట్ ను ₹34,999 కి విక్రయిస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా HDFC, ICICI Bank కార్డుల ద్వారా EMI లేదా ఫుల్ పేమెంట్ ఆప్షన్లతో కొనుగోలు చేసే వినియోగదారులకు ₹2000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7 ఇంచ్ pOLED curved display ను అందిస్తోంది..144 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.. 1.5k resolution, HDR 10 + సపోర్టుతో అదనాతనమైన విజువల్స్ అనుభూతి అందిస్తుంది.. స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్ సెట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.. 12 జిబి ర్యామ్ తో పాటు, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇది ఆండ్రాయిడ్ 14 OS పై పనిచేస్తుంది.

edge 50 Pro లో ఏఐ పవర్ ట్రిబుల్ రియర్ కెమెరా సెట్ అప్ ఉంది. 50 మెగాపిక్సల్స్ మెయిన్ + 13 మెగాపిక్సల్స్ అల్ట్రా వైడ్ + టెన్ మెగాపిక్సల్స్ టెలి ఫోటో కెమెరా ఈ ఫోన్ సొంతం. 30 FPS వద్ద 4K UHD, RAW ఫోటోలను తీయగలుగుతుంది. ఇందులో 4500 mAH బ్యాటరీ, 67 W turbo power charging, 50 W wireless charging support కలిగి ఉంది.