Motorola Edge 50 Pro: కొత్త సంవత్సరం, క్రిస్మస్ పండుగలు వస్తున్నవేళ మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఏర్పడ్డాయి. ప్రముఖ Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ పై ఏకంగా 44 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చారు. ఫ్లాగ్ ఫిష్ స్థాయి ఫీచర్లు ఉండడంతో పాటు బ్యాటరీ సామర్థ్యం, మంచి కెమెరా పని తీరు ఉన్న ఈ ఫోన్ కూడా తక్కువ ధరలో రావడం పై అందరినీ ఆసక్తి రేపుతోంది.. ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోరుకునే వారికి.. గేమింగ్ కావాలని అనుకునే వారికి ఇది చాలా అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ మొబైల్ ఎలా ఉంటుందో చూద్దాం..
Motorola కంపెనీ Edge 50 Pro పేరిట ఓ మొబైల్ మార్కెట్లో అలరిస్తోంది. మిగతా ఫోన్ల కంటే ఇందులోని సాఫ్ట్వేర్ అప్డేట్ టెక్నాలజీతో స్టోర్ అయి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ త్రీ ప్రాసెసర్ తో పనిచేయడంతో రోజంతా ఉపయోగించినా కూడా ఫోన్ పై ఎలాంటి భారం పడకుండా ఆపుతుంది. ఎక్కువ గేమింగ్ ఆడే వారికి ఇది ఎలాంటి సమస్యలు తీసుకురాదు. ఇందులో 12gb రామ్ ను సెట్ చేశారు. 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండడంతో ఫైల్స్ కావాల్సిన దానికంటే ఎక్కువగా లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ తో పాటు స్టోరేజ్ విషయంలో అంతకుమించి అన్నట్లు పనిచేస్తుంది.
ప్రతి మొబైల్ లో ప్రధాన ఆకర్షణగా కెమెరా ఉంటుంది. అలాగే Motorola Edge 50 Pro లోను కెమెరా పనితీరు అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ప్రైమరీగా 50 MP కెమెరాలు అమర్చారు. అలాగే 13 MP అల్ట్రా వైడ్ లైన్స్, 10 MP టెలిఫోటో కెమెరాను సెట్ చేశారు. సెల్ఫీ కావాలనుకునే వారికి సైతం 50 మెగా పిక్సెల్ కెమెరా అందిస్తుంది. ఈ మొత్తం OIS సపోర్టుతో ఉండడంతో కావాల్సి కున్న రీతిలో ఫోటోలు వస్తాయి. ఫోటోగ్రఫీ పై ఎక్కువగా ఆసక్తి ఉన్నవారు ఇది చాలా సపోర్ట్ గా ఉంటుంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ 1.5 K హాయ్ రిజర్వేషన్ తో 6.7 అంగుళాల కార్డవ్ poled డిస్ప్లేను కలిగి ఉంది. 144 Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ ఉండడంతో వీడియోలు చూసేవారికి.. మూవీస్ ఆస్వాదించడానికి.. గేమ్స్ ఆడేవారికి మీ డిస్ప్లే ప్రధానంగా ఉపయోగపడుతుంది.
అయితే ఈ ప్రాసెస్ అంతా తట్టుకునేందుకు బలమైన బ్యాటరీ వ్యవస్థను అమర్చారు. ఇందులో 4,500mAh బ్యాటరీ ఉండగా.. ఇది 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ శాతం చార్జింగ్ పూర్తయి రోజంతా డౌన్ టైం తక్కువగా ఉండగలుగుతుంది.
అసలు విషయానికి వస్తే ఈ ఫోన్ పై ప్రస్తుతం భారీ ఆఫర్ ను ప్రకటించారు. Motorola Edge 50 Pro మార్కెట్లో ప్రస్తుతం రూ.41,999 ఉండగా.. దీనిపై ప్లాట్ డిస్కౌంట్ 44% వరకు వస్తుంది. అంటే రూ.18,650 తగ్గి రూ.23,349కి పొందవచ్చు. అలాగే HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా మరింత తగ్గింపు ఉండే అవకాశం ఉంది. Axis బ్యాంకు సైతం క్రెడిట్ కార్డు లావాదేవీల పై తగ్గింపు ప్రకటించింది.