Mobile Theft: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటోంది. కమ్యూనికేషన్ తో పాటు వివిధ అవసరాల నిమిత్తం స్కూల్ కెళ్లే విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు మొబైల్ యూజ్ చేస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ స్మార్ట్ మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు కొత్త డిజైన్ ను కలిగి ఆకర్షస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ధర ఎక్కువగానే ఉంటోంది. అయితే బోలెడు డబ్బు పెట్టి కొనుగోలు చేసిన మొబైల్ ను ఎంతో అపురూపంగా చూసుకోవాలి. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి మొబైల్ మిస్ అవుతూ ఉంటుంది. అయితే మొబైల్ పోయిన బాధ కంటే అందులో ఉండే డేటా లేదనే ఆవేదన ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే?
ముందుగా మొబైల్ కొనుగోలు చేయగానే అందులో ఉండే Find My Divice అనే ఆప్షన్ ను ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసిన మొబైల్ ఎక్కడికి వెళ్లినా.. ట్రేసింగ్ ద్వారా తెలిసిపోతుంది. ఆతరువాత ఇతర మొబైల్ నుంచి కాల్ సిమ్ నెట్ వర్క్ కు కాల్ చేసి సిమ్ ను వెంటనే బ్లాక్ చేసుకోవాలి. లేకుంటే చాలా మంది మీ నెంబర్ పై ఇతర ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మొబైల్ కొనుగోలు చేసినప్పుడు దానికి వచ్చే బాక్స్ పై కొన్ని నెంబర్స్ ఉంటాయి. వీటిని పోలీస్ స్టేషన్లో ఇస్తే దాని ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.
మొబైల్ తస్కరించిన వెంటనే www.ceir.gov.in అనే వెబ్ సైట్ కు వెళ్లి ఫోన్ దొంగిలించినట్లు కంప్లయింట్ ఇవ్వాలి. ఇందులో డీటేయిల్స్ తో పాటు ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మొబైల్ లో ఇతర సిమ్ వేసినా పనిచేయదు. అంతేకాకుండా ఈ మొబైల్ నుంచి సిమ్ తీసినా వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుంది. అయితే ఇన్ని కష్టాలు రాకుండా ఉండాలంటే ముందుగా మొబైల్ ను జాగ్రత్తగా వాడుకోవాలి.
చాలా మంది మొబైల్ లో విలువైన సమాచారాన్నా సేవ్ చేసుకుంటారు. కానీ ఇదే సమాచారాన్ని మెయిల్ లేదా ఇతర డివైజ్ లో స్టోర్ చేసుకోవడం మంచిది. ఒక వేళ మొబైల్ దొంగిలించబడినా వెంటనే డేటా మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.అలాగే కొన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఎక్స్ పోర్ట్ చేసి మెయిల్ లో స్టోర్ చేసుకోవడం మంచింది.