https://oktelugu.com/

షియోమీ ఫోన్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?

భారతదేశంలో తక్కువ సమయంలో షియోమీ సంస్థ ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రేపు ఈ సంస్థ నుంచి ఎంఐ 11 ఫోన్ విడుదల కానుంది. అయితే షియోమీ సంస్థ ఈ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఫోన్ లో షియోమీ సంస్థ కస్టమర్లకు ఛార్జర్ ను అందుబాటులోకి తీసుకురావడం లేదు. షియోమీ సీఈఓ లీ జూన్ ఈ విషయాన్ని వెల్లడించారు. షియోమీ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంఐ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2020 8:29 pm
    Follow us on


    భారతదేశంలో తక్కువ సమయంలో షియోమీ సంస్థ ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రేపు ఈ సంస్థ నుంచి ఎంఐ 11 ఫోన్ విడుదల కానుంది. అయితే షియోమీ సంస్థ ఈ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఫోన్ లో షియోమీ సంస్థ కస్టమర్లకు ఛార్జర్ ను అందుబాటులోకి తీసుకురావడం లేదు. షియోమీ సీఈఓ లీ జూన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    షియోమీ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంఐ 11 ఫోన్ ను కొనుగోలు చేసిన వాళ్లు ఛార్జర్ ను విడిగా కొనాల్సి ఉంటుంది. లేదా పాత ఛార్జర్ ఉన్నవాళ్లు ఆ ఛార్జర్ ను వినియోగించవచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో ఎంఐ 11 ఫోన్ తయారైంది. ఎంఐ 11 ఫోన్ హై ఎండ్ మోడల్ ధర 58,600 కాగా బేస్ వేరియంట్ ధర 50,700 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. 108 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.

    ప్రైమరీ కెమెరాతో పాటు ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంటుంది. స్నాప్ డ్రాగర్ 888 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ తో పని చేయనుంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ ఛార్జర్ లేకుండా ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తుండగా షియోమీ సైతం యాపిల్ బాటలో పని చేస్తోంది. త్వరలో శాంసంగ్ గెలాక్సీ 21 మోడల్ ను ఛార్జర్ లేకుండా తీసుకురానుందని సమాచారం.

    అయితే కంపెనీలు పర్యావరణ హితం అని చెబుతున్నా యూజర్లు మాత్రం ఛార్జర్ లేకుండా ఫోన్ ఇవ్వడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లతో పాటు ఛార్జర్లను కూడా ఇస్తే బాగుంటుందని స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్లు చెబుతున్నారు.