సంక్రాంతికి సీటు సర్దుకున్న ‘క్రాక్’ రవితేజ?

కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ మూతపడింది. అన్నింటికంటే ఎఫెక్ట్ పడింది ఈ రంగంపైనే.. సినిమా షూటింగ్ లు బంద్ అయిపోయి.. సినిమాలు రిలీజ్ ఆగిపోయి.. థియేటర్లు బంద్ అయిపోయి వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి మళ్లి థియేటర్లు తెరిచారు. ఈ క్రిస్మస్ వేళ విడుదలైన తొలి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ క్రమంలోనే సంక్రాంతికి మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందే […]

Written By: NARESH, Updated On : December 27, 2020 8:40 pm
Follow us on

కరోనా కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ మూతపడింది. అన్నింటికంటే ఎఫెక్ట్ పడింది ఈ రంగంపైనే.. సినిమా షూటింగ్ లు బంద్ అయిపోయి.. సినిమాలు రిలీజ్ ఆగిపోయి.. థియేటర్లు బంద్ అయిపోయి వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి మళ్లి థియేటర్లు తెరిచారు.

ఈ క్రిస్మస్ వేళ విడుదలైన తొలి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ క్రమంలోనే సంక్రాంతికి మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందే అనుకున్నట్టు సంక్రాంతి 13, 14,15వ తేదీల్లో టాలీవుడ్ లో సినిమాలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్బంగా 15న కనుమ నాడు రవితేజ ‘క్రాక్’ రిలీజ్ కు రెడీ అయ్యింది.

అయితే అనూహ్యంగా 15వ తేదీనే ‘అల్లుడు అదుర్స్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. రెండు తెలుగు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే కలెక్షన్లు, సినిమా హాల్స్ తేడా వస్తాయని రవితేజ టీం సరద్దుకుంది.

ఈ క్రమంలోనే సంక్రాంతి ప్రారంభానికి ముందే 12న భోగికి ముందు రవితేజ ‘క్రాక్’ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే హిందీ రైట్స్ 11 కోట్లకు అమ్మగా తెలుగు డిజిటల్ , శాటిలైట్ రైట్స్ కు 15 కోట్ల వరకు డిమాండ్ పలుకుతోందట.. సో సినిమా రిలీజ్ కు ముందే రవితేజ మూవీకి 26కోట్ల గిట్టుబాటు కావడంతో ఇక సినిమా థియేటర్లలో ఎలాంటి ఫలితం వచ్చినా బిందాస్ గా రవితేజ రిలీజ్ కు రెడీ అవుతుండడం విశేషం.