
మరో ఐదు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరం రావడంతో పాటు ఫ్రిజ్, వాషింగ్ మిషన్, టీవీల రేట్లు సైతం భారీగా పెరగనున్నాయి. ఈ వస్తువులను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా కొనుగోలు చేస్తే మంచిది. లేకపోతే మాత్రం వచ్చే ఏడాది వీటిని ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వస్తువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ధరలు పెరుగుతుండటం వల్ల వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
పానసోనిక్, సోనీ, ఎల్జీ, థామ్సన్, కొడాక్ సంస్థల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. స్టీల్, ప్లాస్టిక్, కాపర్, అల్యూమినియం లాంటి ముడి పదార్థాల ధరలు పెరగనున్నాయని సమాచారం. గతంతో పోలిస్తే టీవీ ప్యానెల్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా టీవీ ధరలు పెరగనున్నాయి. పానసోనిక్ సీఈవో మనీషా శర్మ 11 శాతం ఉత్పత్తుల ధర పెరిగే అవకాశం ఉందని.. ముడి సరుకుల ధరలు పెరిగితే ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని ఫలితంగా ధరలు పెంచక తప్పదని ఆయన పేర్కొన్నారూ.
జనవరిలో పానసోనిక్ సంస్థ సంస్థ ఉత్పత్తులు 7 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఎల్జీ ఇండియా విభాగం వైస్ ప్రెసిడెంట్ సుధీర్ బాబు మాట్లాడుతూ ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఎల్జీ ఉత్పత్తుల ధర 8 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సోనీ ఎండీ సునీల్ అయ్యర్ మాట్లాడుతూ సోనీ ఇండియా ధరల పెంపు విషయంలో నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
కొడాక్, థామన్స్ సంస్థలు టీవీ ధరలను 200 శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. చైనాలో మాత్రమే టీవీ ప్యానెళ్లు తయారవుతాయి. ఈ ప్యానెళ్లు చైనాలో మాత్రమే తయారవుతాయి కాబట్టి టీవీల ధరలను కంపెనీలు పెంచుతున్నాయని తెలుస్తోంది.