https://oktelugu.com/

Whatsapp : వాట్సాప్‌లో ఇక నంబర్‌ అవసరంలేదు.. యూజర్‌ నేమ్‌తో మెసేజ్

ఎవరితోనైనా వాట్సాప్‌లో సంభాషించాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. బంధువులు, స్నేహితులకు కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలం. కానీ కొత్తగా పరిచయం అయిన ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ ఇవ్వాలంటే కొంతమంది భయపడుతుంటారు. మొబైల్ నంబర్ అందరికీ ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయని భావిస్తుంటారు. అదే యూజర్ నేమ్‌ ఫీచర్‌తో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు.

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2024 / 02:06 PM IST

    Whatsapp features

    Follow us on

    Whatsapp :ప్రస్తుతం వాట్సాప్ యూజ్ చేయని వాళ్లు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వాడిన అందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు. ఎవరో కొందరు మాత్రమే వాట్సాప్ వాడరు. అయితే యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ మార్పులు చేస్తోంది. దీని వాడకం పెరిగిన తర్వాత వీలైనంత వరకు అప్‌డేట్ చేస్తూ కొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా అందరూ మొబైల్ నంబర్‌తో వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్‌లు చేస్తుంటారు. మొబైల్ నంబర్ ఉంటేనే వాట్సాప్‌లో కనెక్ట్ ఉంటుంది. లేకపోతే వాట్సాప్‌లో అసలు మెసేజ్, కాల్స్ చేయలేరు. కొన్నిసందర్భాల్లో వాట్సాప్ నంబర్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మెటా యూజర్ నేమ్‌తో కనెక్ట్ ఉండేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. అసలు ఫోన్ నంబర్‌తో పనిలేకుండానే యూజర్ నేమ్‌తో వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు.

    ఎవరితోనైనా వాట్సాప్‌లో సంభాషించాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. బంధువులు, స్నేహితులకు కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలం. కానీ కొత్తగా పరిచయం అయిన ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ ఇవ్వాలంటే కొంతమంది భయపడుతుంటారు. మొబైల్ నంబర్ అందరికీ ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయని భావిస్తుంటారు. అదే యూజర్ నేమ్‌ ఫీచర్‌తో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. ఫోన్ నంబర్ ఇవ్వడం ఇష్టంలేని వాళ్లకి యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అయితే యూజర్ నేమ్‌తో ఈజీగా ఎవరితోనైనా సంభాషించవచ్చని కొందరు అనుకుంటారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మొదటిసారి మాట్లాడేటప్పుడు యూజర్‌నేమ్‌తో పాటు పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్‌లో యూజర్‌నేమ్‌తో పాటు నాలుగంకెల పిన్ ముందుగా క్రియేట్ చేసుకోవాలి. ముందు నుంచే మాట్లాడుతున్న వ్యక్తులు అయితే పిన్ ఎంటర్ చేయక్కర్లేదు.

    ఈ ఫీచర్‌ వల్ల తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నియంత్రించవచ్చు. అందరికీ మన మొబైల్ నంబర్ ఇవ్వాలసిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచి పనిచేస్తుందో ఇంకా పూర్తిగా తెలియదు. వీటితో పాటు స్పామ్ కాల్స్ నుంచి విముక్తి కల్పించడానికి సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. సైబర్ క్రైమ్, అపరిచితుల నుంచి ఎలాంటి సందేశాలు రాకుండా వాళ్ల అకౌంట్‌ను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ స్టోరీలను లైక్ చేసే ఫీచర్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.