YS Jagan Mohan Reddy : వైఎస్ కుటుంబంలో భారీ చీలిక వస్తోందా?త్వరలో కొంతమంది షర్మిలకు మద్దతు తెలపనున్నారా? ఆమెకి కుటుంబ మద్దతు పెరగనుందా?అందుకే జగన్ డిఫెన్స్ లో పడిపోయారా?అవినాష్ రెడ్డిని తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆ కుటుంబంఒక వెలుగు వెలిగింది.చిన్నచిన్న అరమరికలు ఉన్నా..రాజశేఖర్ రెడ్డి సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లేవారు.కానీ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆ కుటుంబంలో జరిగిన పరిణామాలుఐక్యతను దెబ్బతీశాయి.ముఖ్యంగా వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి కుటుంబం టార్గెట్ చేసుకుంది. ఆయన కానీ జగన్ కు దగ్గర అయితే తమకు ప్రాధాన్యం ఉండదని ఒక నిర్ణయానికి వచ్చింది. రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని భావించింది.వివేక హత్య నుంచిఆ కుటుంబంలో స్పష్టమైన చీలిక వచ్చింది. అదే సమయంలో జగన్ సైతం తన సోదరి షర్మిలను దూరం పెట్టారు. ఆమె సైతం వివేకా హత్య విషయంలో సోదరుడిని విభేదించడం ప్రారంభించింది. అయితే గత ఐదేళ్లపాటు జగన్ అధికారంలో ఉండడంతో.. కుటుంబ సభ్యులు సైతం అయీష్టంగానే ఆయనతో ముందుకు సాగారు. వైయస్ సునీతతో పాటు షర్మిల గట్టిగానే పోరాటం చేశారు. ఆ పోరాటంలో వారికి అండగా నిలవాలనుకున్న కొంతమంది కుటుంబ సభ్యులు భయపడ్డారు. జగన్ అధికారంలో ఉండడంతో ఎదురు తిరిగేందుకు ముందుకు రాలేకపోయారు.ఇప్పుడు జగన్ ఓడిపోయేసరికి వారంతా షర్మిల గొడుగు కిందకు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.దీంతో జగన్ కు కుటుంబ బలం మరింత తగ్గే అవకాశం ఉంది.
* చెల్లెలి వెంటే తల్లి
జగన్ తల్లి విజయమ్మ ప్రస్తుతం కుమార్తె షర్మిల వైపు ఉన్నారు.ఎన్నికల్లో తన కుమార్తెను గెలిపించాలని మాత్రమే ఆమె కోరారు.కనీసం జగన్ గురించి పట్టించుకోలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా విజయమ్మ స్పందించలేదు.అందుకే ఆమె షర్మిల వెంట స్ట్రాంగ్ గా ఉండిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు.అయితే కుటుంబంలో విభేదాలు రావడానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి. అందుకే ఆయనను తప్పించి పార్టీ పగ్గాలు తన మేనమామకు అప్పగించారు జగన్.
*:మేనమామకు పార్టీ పగ్గాలు
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు జగన్. మొన్నటి ఎన్నికల్లో కడపలో సైతం వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఆ పార్టీకి దక్కింది మూడు మాత్రమే. దీంతో పార్టీలో సైతం ఒక రకమైన తిరుగుబాటు కనిపిస్తోంది. కేసుల భయంతో అవినాష్ రెడ్డి పెద్దగా బయటకు రావడం లేదు. కడప జిల్లా పరిషత్తును దక్కించుకొని సత్తా చాటాలని కూటమి చూస్తోంది. అందుకే జగన్ జాగ్రత్త పడ్డారు. జడ్పిటిసి లను బుజ్జగించారు. పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలను మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పచెప్పారు.
* జడ్పిటిసి లతో సమావేశం
ప్రస్తుతం కడపలో పార్టీని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే.. కుటుంబం నుంచి షర్మిల కు మద్దతు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తు. అందుకే జగన్ ఇప్పుడు రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. కానీ కూటమి డోర్లు తెలిస్తే ఎంతమంది జడ్పిటిసిలు ఉంటారో? ఎంతమంది ఉండరో తెలుస్తుంది. అయితే కూటమి రంగంలోకి దిగితే మాత్రం కడప రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.