Maruti Cars: మారుతి కార్లు అనగానే చాలా మందికి క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరసమైన ధరలతో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు ఈ కంపెనీనుంచి వచ్చిన ఎన్నో కార్లు అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకున్నాయి. దశాబ్దాల కింద మార్కెట్లోకి వచ్చిన కొన్ని కార్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి కొత్త కార్లను తీసుకొస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఆల్టో కారు కొత్త తరహాలో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఆల్టో విద్యుత్ కారు ఆకర్షిస్తోంది. ఆ కారు ఎలా ఉందంటే?
Also Read: ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!
పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో విద్యుత్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో చాలా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే మారుతి కంపెనీ నుంచి కూడా విద్యుత్ కారు రాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే గతంలో మార్కెట్లో ఉన్న ఆల్టో కారు ఇప్పుడు విద్యుత్ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతుంది. అదే ఆల్టో ఎలక్ట్రిక్ 800. చూడ్డానికి చాలా స్టైలిష్ గా కనిపించే ఈ కారు అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉంది.
ఈ కారులో 25 నుంచి 27 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీని వాడుతున్నారు. అంతేకాకుండా మెటార్ పవర్ 40 నుంచి 45 కిలో వాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో డీసీ పాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేసే సామర్థ్యం ఉంటుంది. అంటే ఎక్కడైనా ఫాస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే తో పాటు రేంజ్, టెంపరేచర్ వంటి ఆప్షన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ మోడల్ రూ.7 నుంచి 8 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
తక్కువ మెయింటనెన్స్ తో పాటు వాతావరణానికి అనుకూలంగా ఉండే ఆల్టో కారు ఇప్పుడు విద్యుత్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈఎంఐ ద్వారా తీసుకోవాలని అనుకునేవారికి సబ్సీడీ కూడా అవకాశం ఉంది. అందువల్ల మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఈ కారు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.