Earbuds: ఇండియన్ మార్కెట్లోకి Marshall minor IV ఇయర్ బడ్స్… ధర ఎంతంటే?

Earbuds: ఈ కొత్తరకం ఇయర్ బడ్స్ ను తయారు చేసేందుకు మార్షల్ సంస్థ వాడి పడేసిన ప్లాస్టిక్ సిడి క్యాసెట్లు, వాషింగ్ మెషిన్లు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను రీసైకిల్ చేసి తయారుచేసినట్టు తెలిపింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 18, 2024 11:35 am

Marshall minor IV

Follow us on

Earbuds: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. సరికొత్త ఉత్పత్తులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకు రావడంతో.. పాత కంపెనీలు పోటీను తట్టుకునేందుకు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. ఇలా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రముఖ ఆడియో ఉత్పత్తుల సంస్థ మార్షల్.. సరికొత్త ఇయర్ బడ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.. దీనిని Marshall minor IV అనే పేరుతో విడుదల చేసింది. అయితే వీటిని తయారు చేసిన విధానాన్ని మార్షల్ సంస్థ గొప్పగా చెప్పుకుంటుంది.

ఈ కొత్తరకం ఇయర్ బడ్స్ ను తయారు చేసేందుకు మార్షల్ సంస్థ వాడి పడేసిన ప్లాస్టిక్ సిడి క్యాసెట్లు, వాషింగ్ మెషిన్లు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను రీసైకిల్ చేసి తయారుచేసినట్టు తెలిపింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ లో 40 శాతం ప్లాస్టిక్ వాడినట్టు వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా మార్షల్ సంస్థ తయారు చేసే ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. అమెరికా నుంచి మొదలు పెడితే యూరప్ వరకు ఈ బ్రాండ్ తయారుచేసే ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇంతకీ ఈ కొత్త ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయంటే..

మైనర్ IV ట్రూ వైర్లెస్ బడ్స్ 12 వేల రూపాయలకు మార్షల్ సంస్థ విక్రయిస్తోంది. మార్షల్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్ లో ఇవి లభ్యమవుతున్నాయి. వీటి సేల్ జూన్ 15 నుంచి ప్రారంభమైంది. ఈ బడ్స్ లో అధునాతనమైన సిగ్నేచర్ సౌండ్ లభిస్తుందని మార్షల్ సంస్థ చెబుతోంది. 12 ఎంఎం స్పీకర్లు, బ్యాలెన్స్డ్ సౌండ్ తో ఈ ఇయర్ బడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ సమయం పాటు వీటిని ఉపయోగించినా.. ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా తయారు చేసినట్టు మార్చల్ సంస్థ చెబుతోంది. ఇందులో నేవిగేషన్, కాలింగ్ సదుపాయం కోసం టచ్ కంట్రోల్స్ ఏర్పాటు చేసింది.

ఈ ఇయర్ బడ్స్ వైర్లెస్ చార్జర్ ను సపోర్ట్ చేస్తాయి. టైప్ C పోర్ట్ తో ఫాస్ట్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది 30 గంటల పాటు ప్లే టైం అందిస్తుంది. డిజైన్ కూడా చాలా తేలికగా ఉంది. యూజర్ సౌండ్ ను కస్టమైజ్ చేసుకోవడానికి ఇందులో ప్రత్యేక ఏర్పాటు ఉంది. బ్లూటూత్ ద్వారా మల్టీ కనెక్టివిటీని పొందొచ్చు. మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా.. అనేక డివైసెస్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో సౌండ్ అనుభూతి కూడా డాల్బీ టెక్నాలజీకి మించి ఉంటుంది. అతి సరళమైన, సూక్ష్మమైన శబ్దాన్ని కూడా ఈ ఇయర్ బడ్స్ లో స్పష్టంగా వినవచ్చని మార్షల్ సంస్థ చెబుతోంది.