This is Mars: మార్స్.. లేదా అరుణగ్రహం లేదా అంగారక గ్రహం.. ఇది మన సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి నాల్గవ గ్రహం. ఎర్రగా కనిపించడం వల్ల దీనికి అరుణ గ్రహం పేరు వచ్చింది, ఇది ఇనుము ఆక్సైడ్ (తుప్పు) వల్ల ఏర్పడుతుంది. ఈ గ్రహంపై జీవం ఉనికి, నీటి జాడలను కనుగొనడానికి నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నాయి, రోవర్లు, ప్రోబ్‌లను పంపి వివరాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ 2035 నాటికి మార్స్‌పై మానవ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అరుణ గ్రహం వీడియోను నాసా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భూమితో ఏమాత్రం పోలిక లేదు..
అరుణ గ్రహం మీద నుంచి∙వచ్చిన షేకింగ్ వీడియోలు చూస్తే, మన భూమి ఎడారుల్లో తిరిగినట్టే అనిపిస్తుంది. లోయలు, రాళ్లు, ధూళి తుఫానులు అన్నీ భూమి దృశ్యాలకు పోలిక లేకుండా ఉన్నాయి. ఇది భూమి నుంచి 225 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది.
భూమి వర్సెస్ మార్స్..
మార్స్ మీద భూమి ఎడారుల్లాంటి భారీ క్రేటర్లు, పర్వతాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం లోహాలు, ఖనిజాలు. భూమి, మార్స్ మధ్య ఈ విషయంలో సారూప్యత ఉంది. భూమిలో సాహారా లాంటి తుఫానులు మార్స్ మీద ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. అరుణగ్రహంపై ఆక్సిజన్ లేదు. రెడ్ ప్లానెట్ అని పిలవడానికి ఇనుము ఆక్సైడ్ (రస్ట్) కారణం. భూమి ఎడారుల్లో కూడా ఇలాంటి రంగులు కనిపిస్తాయి, కానీ మార్స్ మీద అవి భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవి చూస్తే భూమికి పోలికే లేదని అనిపించకపోవచ్చు, కానీ నాసా రోవర్లు (పెర్సివరెన్స్ వంటివి) చూపిన ఫొటోలు ఈ సారూప్యతను ధ్రువీకరిస్తాయి.
మార్స్‌పై అగ్ని పర్వతం..
నాసా మార్స్‌పై అగ్నిపర్వతం ఉన్నట్లు గుర్తించింది. 2007లోనే కనుగొన్నారు. పెర్సెవరెన్స్ రోవర్ గ్రహంపైకి చేరుకున్న తర్వాత కచ్చితమైన ఆధారాలు దొరికాయి. 2021 తర్వాత దీనిని గుర్తించారు. 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం, ఒక ఉల్క ఢీకొనడం వల్ల ఇక్కడ ఒక లోతైన బిలం ఏర్పడిందని, అది నీటితో నిండిపోయి ఒక సరస్సుగా ఏర్పడిందని పరిశోధనలో తేలింది.
ఈ షేకింగ్ దృశ్యాలు మనల్ని ఆకర్షించడానికి మరో కారణ మార్స్ మీద జీవం ఉండొచ్చనే అవకాశం. భూమి ఎడారుల్లో ఎలా మైక్రోబ్స్ బతుకుతాయో, అక్కడ కూడా ఆశలు ఉన్నాయి. స్పేస్ ఎక్స్, నాసా మిషన్లు దీన్ని రుజువు చేయడానికి పనిచేస్తున్నాయి.
This is Mars!
It’s honestly terrifying how much this looks like a random desert on Earth.
Just a casual 225 million miles away.
The clarity is unreal. pic.twitter.com/M0Ih5njRjx
— Curiosity (@MAstronomers) January 3, 2026