https://oktelugu.com/

iPhone : అద్భుతమే ఇదీ.. నదిలో పడిన 10 నెలల తర్వాత కూడా పనిచేస్తున్న ఐఫోన్

iPhone :  ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింతలు విశేషాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగింది అద్భుతమే. అమెరికా టెక్నాలజీ దిగ్గజానికి ఇదొక గౌరవమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఐఫోన్ గురించి అందరూ చెప్పడమే కానీ.. ఇప్పుడు నిజంగా నిరూపితమైంది. దాని టెక్నాలజీ, భద్రత, నాణ్యతకు ఇదే మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఫోన్ క్వాలిటీకి ఈ ఘటన ఉదాహరణ అని చెప్పొచ్చు.. సాధారణంగా నీటిలో ఫోన్ పడితే ఇక ఆశలు వదలుకోవాల్సిందే..అది మళ్లీ పనిచేసిన దాఖలాలే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2022 / 06:18 PM IST
    Follow us on

    iPhone :  ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని వింతలు విశేషాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగింది అద్భుతమే. అమెరికా టెక్నాలజీ దిగ్గజానికి ఇదొక గౌరవమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఐఫోన్ గురించి అందరూ చెప్పడమే కానీ.. ఇప్పుడు నిజంగా నిరూపితమైంది. దాని టెక్నాలజీ, భద్రత, నాణ్యతకు ఇదే మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఫోన్ క్వాలిటీకి ఈ ఘటన ఉదాహరణ అని చెప్పొచ్చు..

    సాధారణంగా నీటిలో ఫోన్ పడితే ఇక ఆశలు వదలుకోవాల్సిందే..అది మళ్లీ పనిచేసిన దాఖలాలే ఉండవు. కొన్ని వాటర్ ఫ్రూఫ్ మొబైళ్లు కూడా పనిచేసిన దాఖలాలు ఉండవు. కానీ ఐఫోన్ అలా కాదు.. ఇది కంప్లీట్ వాటర్ ఫ్రూఫ్ అని ఈ ఘటనతో నిరూపించుకుంది. ఏకంగా 10 నెలల క్రితం నడిలో పడితే ఇక ఆ ఫోన్ పని అయిపోయిందని అంతా అనుకుంటారు. కానీ అది పనిచేస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. అది ఓ రకంగా పెద్ద షాక్ యే.. సంవత్సరం పాటు నీళ్లలో ఉండి పనిచేస్తుందంటే అది అలాంటి ఇలాంటి ఫోన్ కాదు.. ప్రపంచంలోనే నంబర్ టెక్నాలజీ ఫోన్ ‘ఐఫోన్’.

    యూకేకి చెందిన ఓవైన్ డేవిస్ తన ఐఫోన్‌ను ఆగస్టు 2021లో బ్యాచిలర్ పార్టీ సందర్భంగా గ్లౌసెస్టర్‌షైర్ లోని సిండర్‌ఫోర్డ్ సమీపంలోని వై నదిలో పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్ వెతికినా దొరకదని భావించి ఇంటికి తిరిగి వచ్చాడు. దాదాపు పది నెలల తర్వాత అదే నదిపై తన కుటుంబంతో కలిసి పడవలో ప్రయాణించిన మిగ్యుల్ పచేకో నదిలో చూస్తుండగా ఐఫోన్ ను చూశాడు. నదిలో పోగొట్టుకున్న ఫోన్ ను తీసుకున్నాడు. ఫోన్ ఓనర్‌ను కనిపెట్టేందుకు ఫోన్‌ను ఆరబెట్టిన తర్వాత అదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. “ఇది నాకు నదిలో దొరికిందని.. పనిచేస్తోందని” పేర్కొన్నాడు.

    ఫోన్ ను ఎండలో ఆరబెట్టి ఛార్జ్ చేసినప్పుడు, అది చార్జ్ కావడాన్ని చూసి షాక్ అయ్యాడు. 10 నెలల తర్వాత కూడా పనిచేస్తున్న ఆ ఫోన్ ను చూసి అబ్బురపడ్డాడు. తర్వాత దాన్ని స్విచ్ ఆన్ చేయగా.. ఫోన్ తెరపై ఒక పురుషుడు- స్త్రీ స్క్రీన్‌సేవర్‌ను చూశాడు. పోగొట్టుకున్న ఐఫోన్ గురించి పచెకో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. 4000 మంది దీన్ని షేర్ చేశాడు. అయితే డేవిస్ సోషల్ మీడియాలో లేడు. అతని స్నేహితులు ఫోన్‌ని గుర్తించి, పచేకోతో కనెక్ట్ అవ్వడంలో డేవిస్‌కు సహాయం చేసారు. పచెకో ఆ ఫోన్ దాని ఓనర్ కు అందజేసి ఫిదా చేశఆడు.

    ఇటీవలి సంవత్సరాలలో ప్రారంభించబడిన ఐఫోన్‌లు అన్నీ వాటర్ ఫ్రూఫ్ గా తీర్చిదిద్దారు.,ఫోన్‌లు 1.5 మీటర్ల మంచినీటిలో 30 నిమిషాల పాటు ఉండగలవని ఐఫోన్ సంస్థ చెబుతుంది. అయితే ఏకంగా 10 నెలల పాటు నీటిలో ఉన్నా పాడవని ఐఫోన్ బయటపడడం ఇదొక టెక్నాలజీ అద్భుతమనే చెప్పొచ్చు.